భోపాల్: ప్రభుత్వ ఆసుపత్రిలోని బెడ్లపై కుక్కలు విశ్రాంతి తీసుకున్నాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ప్రభుత్వ ఆసుపత్రి తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. (Dogs On Government Hospital Beds) ఈ నేపథ్యంలో ఒక ఉద్యోగిని సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కిల్లాడ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లోని రోగుల బెడ్లపై కుక్కలు నిద్రించాయి. దీంతో కుక్కలను చూసి రోగులు భయాందోళన చెందారు.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో మెడికల్ ఆఫీసర్ స్పందించారు. క్లీనర్‌ను తక్షణమే తొలగించినట్లు తెలిపారు. అలాగే డ్యూటీలో ఉన్న నర్సు ఏడు రోజుల జీతం తగ్గించనున్నట్లు చెప్పారు. అయితే నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య అధికారులను ఆదేశించినట్లు జిల్లా కలెక్టర్ రిషవ్ గుప్తా మీడియాకు వెల్లడించారు.
खंडवा में मरीजों की जगह बेड पर सोते नजर आए कुत्ते | Khandwa News
MP के खंडवा में सामुदायिक स्वास्थ्य केंद्र किल्लोद में मरीज की जगह बेड पर कुत्ते आराम फरमा नजर आए। सिविल सर्जन ने BMO को भेजा नोटिस। #hospital #mismanagement #civil #surgeon #BMO #notice #PilotRakeshTyagi pic.twitter.com/EV4VYqCIQ9
— Public Vani News (@publicvaninews) November 22, 2025
Also Read:
Girl Jumps Off School Building | స్కూల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. విద్యార్థిని ఆత్మహత్య
Man Kills Younger Brother | తమ్ముడి నేర ప్రవర్తన సహించలేక.. హత్య చేసిన అన్న
Watch: కదులుతున్న రైలులో నూడుల్స్ వండిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: మినీ లారీని ఢీకొట్టిన వాహనం.. తర్వాత ఏం జరిగిందంటే?