బెంగళూరు: తమ్ముడి నేర ప్రవర్తనను అన్న సహించలేకపోయాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి కారులో అతడ్ని హత్య చేశాడు. (Man Kills Younger Brother) మృతదేహాన్ని ఒక చెరువులో పడేశారు. అయితే అతడి హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. కాలబురగి జిల్లాకు చెందిన 28 ఏళ్ల శివరాజ్, 24 ఏళ్ల ధనరాజ్ అన్నాదమ్ములు. అయితే మద్యానికి వ్యసనమైన ధన్‌రాజ్ నేరాల బాట పట్టాడు. పొరుగువారి ఇంట్లోని వస్తువులు, మొబైల్ ఫోన్లు దొంగిలించేవాడు. అందరితో గొడవ పడేవాడు. అతడి పద్ధతిని ప్రశ్నించిన తల్లిదండ్రులతో పాటు అన్న శివరాజ్‌ను కొట్టాడు.
కాగా, బెంగళూరులో క్యాబ్ నడుపుతున్న శివరాజ్ తమ్ముడు ధనరాజ్ నేర, హింసాత్మక ప్రవర్తన పట్ల విసిగిపోయాడు. స్నేహితులైన 24 ఏళ్ల సందీప్, 26 ఏళ్ల ప్రశాంత్‌తో కలిసి తమ్ముడి హత్యకు ప్లాన్ వేశాడు. నవంబర్ 2న ఉద్యోగం పేరుతో ధనరాజ్‌ను బెంగళూరుకు రప్పించాడు. స్నేహితులతో కలిసి క్యాబ్‌లో తమ్ముడి గొంతుకోసి హత్య చేశాడు. ముగ్గురూ కలిసి మృతదేహాన్ని చెరువులో పడేశారు.
మరోవైపు నవంబర్ 6న చెరువులో కుళ్లిన మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. తమ్ముడు ధనరాజ్‌ను హత్య చేసిన శివరాజ్ క్యాబ్ నుంచి మృతదేహాన్ని బయటకు తీసి స్నేహితులతో కలిసి చెరువులో పడేయటం ఒక ప్రైవేట్ కంపెనీ వద్ద ఉన్న సీసీటీవీలో రికార్డ్ అయ్యింది.
కాగా, ఈ ఫుటేజ్ ద్వారా క్యాబ్ నంబర్ ఆధారంగా నిందితులను పోలీసులు గుర్తించారు. శివరాజ్, అతడి ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు. తమ్ముడి నేర ప్రవృత్తిని సహించలేక అన్న హత్య చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. నిందితులను జైలుకు తరలించినట్లు వెల్లడించారు.
Also Read:
Sensitive Naval Data Leaked To Pak | నేవీ కీలక సమాచారం పాక్‌కు లీక్.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
Arms Racket Busted | చైనా, టర్కీలో తయారై పాక్ నుంచి సరఫరా.. అంతర్జాతీయ ఆయుధ రాకెట్ గుట్టురట్టు
Watch: కదులుతున్న రైలులో నూడుల్స్ వండిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే?