Dasoju Shravan kumar | ఎవర్రా మీరంతా.. మీరేమన్నా ఇండ్లు కట్టారా..? సీఎం రేవంత్ సర్కార్ పై ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్ ధ్వజం
Dasoju Shravan kumar | ఆకలితో అలమటించే వాడికి పట్టెడన్నం పెట్టకపోయినా పర్వాలేదు.. కానీ ఉన్న నీడను లాగేసుకుని వాడి బతుకుని రోడ్డున పడేయకండని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ సర్కార్‌ను కోరారు.
Dasoju Shravan kumar | రేవంత్ రెడ్డి పండుగ పూట ఎంత విధ్వంసం చేస్తుండనడానికి ఉదాహరణ.. నాకు ఈ వీడియో చూశాక బాధనిపించింది. కండ్లలోకి నీళ్లొచ్చినయంటూ వెలుగుమట్ల బాధితుల గోడును బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్‌కుమార్ వివరించారు.
వెలుగుమట్టలో ఎవరో పేద తల్లి.. ఈ ప్రభుత్వం ఎంత దుర్మార్గానికి, విధ్వంసానికి, దాష్టీకానికి, దోపిడీకి పాల్పడుతుంది.. ప్రజల జీవితాలను ఛిద్రం చేస్తుందనడానికి. ఎందుకా వేల కోట్లు, లక్షల కోట్లు మందిల జీవితాలు నాశనం చేసేందుకు .. మంది గూళ్లు కూలగొట్టడమేంటి..? ఆ తల్లి బాధపడుతుంటే నా కండ్లళ్ల నీళ్లొచ్చినయ్. ఎవర్రా మీరంతా.. మీరేమైనా ఇండ్లు కట్టిచ్చినార్రా..ఇండ్లు కూలుస్తా అంటరేంటి..? మీరేమన్నా ఇండ్లు కట్టారా..? ఓ పేదవాడు, మధ్యతరగతి వాడు ఇండ్లు కట్టుకోవాలంటే వాడి జీవితానికి అదొక పండగ. అందరి సమిష్టి కల అది. దాన్ని విధ్దంసం చేస్తా ఉన్నడు రేవంత్ రెడ్డి. గాంధీ విగ్రహం పేరు మీద, వెలుగుమట్టలో కానీ, లగచర్లలో కానీ.. ఎవర్రా మీరు.. ఎక్కడి నుంచి వచిన్రని మండిపడ్డారు.
వాడి బతుకుని రోడ్డున పడేయకండి..
ఆకలితో అలమటించే వాడికి పట్టెడన్నం పెట్టకపోయినా పర్వాలేదు.. కానీ ఉన్న నీడను లాగేసుకుని వాడి బతుకుని రోడ్డున పడేయకండని ఎమ్మెల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ కాంగ్రెస్ సర్కార్‌ను కోరారు. ఇది ప్రజాపాలన కాదు, నిరుపేదలపై సాగుతున్న నిరంకుశ రేవంత్ అరాచక పాలన అని ధ్వజమెత్తారు. కష్టపడి కట్టుకున్న కలల స్వప్నమైన తమ ఇల్లు కూలుతుంటే ఆ కళ్లలో వస్తున్న నీళ్లు.. మీ పతనానికి పునాదులు వేస్తాయని రేవంత్ రెడ్డిని హెచ్చరించారు. స్వార్థం కోసం జనం బతుకులను బుగ్గిపాల్జేస్తున్న ఈ రాక్షస పాలన నశించాలన్నారు. పేదోడి ఉసురు పోసుకుంటున్న ఈ ‘రాబందుల’ అన్యాయానికి అంతం ఎంతో దూరంలో లేదు.. తస్మాత్ జాగ్రత్త.. అని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్‌ను దాసోజు శ్రవణ్ కుమార్ హెచ్చరించారు.
ఆకలితో అలమటించే వాడికి
పట్టెడన్నం పెట్టకపోయినా పర్వాలేదు.. కానీ ఉన్న నీడను లాగేసుకుని వాడి బతుకుని
రోడ్డున పడేయకండి.ఇది ప్రజాపాలన కాదు, నిరుపేదలపై సాగుతున్న
నిరంకుశ రేవంత్ అరాచక పాలన.కష్టపడి కట్టుకున్న కలల స్వప్నమైన తమ ఇల్లు కూలుతుంటే ఆ కళ్లలో వస్తున్న నీళ్లు.. మీ… pic.twitter.com/V7n3svsWy9
— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) March 3, 2026
Read Also :
Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Asif Zardari | మరో యుద్ధానికి భారత్ సన్నాహాలు.. పాకిస్థాన్ అధ్యక్షుడు జర్దారీ ఆరోపణలు
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanumakonda | అసమాన ప్రతిభతో ‘ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్’లో చోటు.. చిన్నారిని అభినందించిన స్కూల్ యాజమాన్యం..!
IND vs WI | చితక్కొట్టిన శాంసన్, తిలక్, అయ్యర్.. రాంచీలో విండీస్ ముందు కొండంత లక్ష్యం..!
Pregnancy | గర్భం కోసం ప్రయత్నిస్తున్న మహిళలు.. ఎప్పుడు ఫెర్టిలిటీ నిపుణులని కలవాలి..?
Students Appeal | ‘మాబడిలో హిందీ టీచర్ లేరు.. కలెక్టర్‌కు చెప్పి మూడు నెలలైనా నియమించలే’..!
Newlywed Couple’s Bodies | కాళ్లకు గొలుసులతో.. నదిలో నూతన దంపతుల మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

