Sanju Samson | అల్లు అర్జున్ నా ఫేవరెట్ హీరో .. సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్
Sanju Samson | టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారిపోయాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 50 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వికెట్లు వరుసగా పడుతున్న వేళ ధైర్యంగా నిలబడి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆ ఇన్నింగ్స్‌పై క్రీడా నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Sanju Samson | టీమిండియా ఓపెనర్ సంజు శాంసన్ ఒక్క మ్యాచ్‌తో స్టార్‌గా మారిపోయాడు. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన డూ ఆర్ డై మ్యాచ్‌లో 50 బంతుల్లో 97 పరుగులు చేసి అద్భుత ప్రదర్శన కనబరిచాడు. వికెట్లు వరుసగా పడుతున్న వేళ ధైర్యంగా నిలబడి జట్టును విజయపథంలో నడిపించాడు. ఆ ఇన్నింగ్స్‌పై క్రీడా నిపుణులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. క్రికెట్‌తో పాటు సినిమాలపై కూడా ఆసక్తి ఉన్న సంజు, ఇటీవల ఓ ర్యాపిడ్ ఫైర్ చిట్‌చాట్‌లో తనకు ఇష్టమైన తెలుగు హీరోల గురించి చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్లో తనకు అత్యంత ఇష్టమైన హీరో అల్లు అర్జున్ అని సంజు వెల్లడించాడు. “నేను మలయాళి అయినా అల్లు అర్జున్ సినిమాలు అన్నీ చూస్తాను. ఆయన ఎనర్జీ, డ్యాన్స్, మాస్ స్టైల్ చాలా ఇష్టం” అని పేర్కొన్నాడు. తెలుగు మాస్ మసాలా సినిమాలు తనకు బాగా నచ్చుతాయని కూడా తెలిపాడు. అల్లు అర్జున్‌తో పాటు మహేష్ బాబు కూడా తనకు ఇష్టమైన హీరో అని సంజు చెప్పాడు. “మహేష్ బాబు స్టైల్, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా క్లాస్‌గా ఉంటుంది. ఆయన యాక్టింగ్ నాకు బాగా నచ్చుతుంది అని అభిప్రాయపడ్డాడు. గతంలో మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలియజేసిన విషయాన్ని అభిమానులు గుర్తు చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చినప్పుడు కూడా సంజు స్పందించాడు. సౌత్ ఇండియన్ సినిమా గ్లోబల్ స్థాయికి చేరడం గర్వకారణమని చెప్పాడు. తెలుగు మాస్ సాంగ్స్ తనలో ఉత్తేజాన్ని నింపుతాయని సరదాగా వెల్లడించాడు. ఇదిలా ఉంటే తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌కి తాను డైహార్డ్ ఫ్యాన్ అని సంజు తెలిపాడు. ఆయన నటించిన అరుణాచలం సినిమాలోని డైలాగ్స్ చెప్పి నవ్వులు పూయించాడు. క్రికెట్ మైదానంలో అద్భుత ప్రదర్శనలతో మెరిసే సంజు శాంసన్, సినిమాలపై తన అభిరుచిని పంచుకోవడం అభిమానులకు మరింత ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారాయి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

