హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ తీరుపై క్రికెట్ సంఘాలు (Cricket Association) మండిపడ్డాయి. హెచ్‌సీఏలో ( HCA ) లో మంత్రి వివేక్ ( Minister Vivek ) కి చెందిన విశాఖ ఇండస్ట్రీస్‌కి రూ.70 కోట్ల అక్రమంగా చెల్లించారని జింఖానా గ్రౌండ్లో మెరుపు ధర్నా నిర్వహించారు.
ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చేందుకు హెచ్‌సీఏ ప్రెసిడెంట్ ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న క్రికెట్ సంఘాలు ఆందోళనకు దిగాయి. అయితే తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని హెచ్‌సీఏ అధ్యక్షులు ప్రకటించారు.
తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎలాంటి చెక్కులపై సంతకాలు పెట్టలేదని, రూ. 69 కోట్ల హెచ్‌సీఏ నుంచి విశాఖ కంపెనీకి చెల్లింపుల వెనుక తన ప్రమేయం లేదని స్పష్టం చేశారు. తాను ఛార్జ్ తీసుకోక ముందే ప్రాసెస్ జరిగిందని, డబ్బులు చెల్లించాలని కోర్టు ఆదేశాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.