తుంగతుర్తి, మార్చి 08 : మహిళలు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో రాణించినప్పుడే సమాజ అభివృద్ధి సాధ్యపడుతుందని తుంగతుర్తి లయన్స్ క్లబ్ అధ్యక్షుడు పాలవరపు సంతోష్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని విశ్రాంతి భవనంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజం అభివృద్ధి చెందాలంటే మహిళలను ఎక్కువగా ప్రోత్సహిస్తూ పారిశ్రామిక రంగంలో రాణించుటకు ప్రభుత్వం అధిక నిధులు కేటాయించాలని కోరారు.
అనంతరం ప్రభుత్వ వైద్యాధికారి డాక్టర్ లావణ్య, మహిళా సమైక్య సంఘం అధ్యక్షురాలు జమున, కరాటే మాస్టర్ బొంకూరి అరుణ, ఆర్యవైశ్య సంఘం మహిళా అధ్యక్షురాలు గుమ్మడవెల్లి విజయ, ఆరోగ్య సిబ్బంది భారతిలను సన్మానించి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లెపాక సాయిబాబా, లయన్స్ క్లబ్ ఉపాధ్యక్షులు తల్లాడ కేదారి, ప్రధాన కార్యదర్శి పులుసు వెంకన్న, కోశాధికారి గుండగాని రాము ప్రోగ్రాం, కో ఆర్డినేటర్లు పులుసు వెంకటనారాయణ గౌడ్, ఓరుగంటి శ్రీనివాస్, ఓరుగంటి సుభాశ్, ఎనగందుల గిరి పాల్గొన్నారు.