Bommaku Murali | హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో సినీ నిర్మాత బొమ్మకు మురళీ కారు బీభత్సం సృష్టించిందని తెలిసిందే. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ మహిళపై నిర్మాత మురళి కారు డ్రైవర్ ఒక్కసారిగా కారు ఎక్కించగా.. ఆమెకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటనలో ఆమె కాలు విరిగింది. దీంతో ఆమెను స్థానికులు వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. గాయాలైన మహిళను నాంపల్లి ఆండాళమ్మ బస్తీకి చెందిన సునీతగా గుర్తించారు.
సునీత గన్ ఫౌండ్రీలోని ఎస్బీఐ బ్యాంకులో హౌస్‌కీపర్‌గా పనిచేస్తుంది. బుధవారం సాయంత్రం (ఆగస్టు 12)న సునీత చాపెల్ రోడ్డు గుండా ఇంటికి నడుచుకుంటూ వెళ్తుండగా.. బొమ్మకు మురళి దగ్గర డ్రైవర్‌గా పనిచేస్తున్న మహానంద కారును వేగంగా నడుపుతూ సునీతపైకి ఎక్కించాడు. తీవ్రగాయాలైన సునీతను స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్సనందించారు. అయితే ఆస్పత్రి ట్రీట్మెంట్ కోసం డబ్బులు చెల్లించాలని నిర్మాత మురళిని కుటుంబసభ్యులు కోరగా.. కారు నాదే కానీ పైసా కూడా ఇవ్వను. యాక్సిడెంట్ చేసిన డ్రైవర్‌ను చంపుకోండి అంటూ దురుసుగా సమాధానమివ్వడం గమనార్హం.కాగా ఈ ఘటనపై అబిడ్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన బొమ్మకు మురళి టెక్నోక్రాట్, సామాజిక, రాజకీయ కార్యకర్త. నిర్మాతగా మారి శరణం గచ్చామి అనే సినిమా కూడా తీశారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ మూవీ భారత రాజ్యాంగం, రిజర్వేషన్ల వ్యవస్థ నేపథ్యంలో సాగుతుంది.
అబిడ్స్‌లో సినీ నిర్మాత బొమ్మకు మురళీ కారు బీభత్సం
నడుచుకుంటూ వెళ్తున్న మహిళపై ఒక్కసారిగా కారు ఎక్కించిన నిర్మాత కారు డ్రైవర్
ప్రమాదంలో మహిళ కాలు ఫ్రాక్చర్
తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలింపు
హాస్పిటల్లో ట్రీట్మెంట్ కోసం డబ్బులు చెల్లించాలని నిర్మాతను… pic.twitter.com/v7PeHZnMY9
— Telugu Scribe (@TeluguScribe) August 13, 2026