Mohan Babu | మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ‘ఇండస్ట్రీ ఎవడబ్బా సొత్తు కాదు’ అంటూ ఫైర్
Mohan Babu | నేచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు పోషించిన ‘షికంజా మాలిక్’ పాత్రకు మంచి స్పందన వస్తోంది. సినిమాలో తనదైన శైలిలో ప్రతినాయకుడి పాత్రను పోషించిన మోహన్ బాబు.. తాజాగా చిత్ర విజయ వేడుకలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు
Mohan Babu | నేచురల్ స్టార్ నాని హీరోగా, యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రస్తుతం ప్రేక్షకుల మధ్య చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా ఈ చిత్రంలో మంచు మోహన్ బాబు పోషించిన ‘షికంజా మాలిక్’ పాత్రకు మంచి స్పందన వస్తోంది. సినిమాలో తనదైన శైలిలో ప్రతినాయకుడి పాత్రను పోషించిన మోహన్ బాబు.. తాజాగా చిత్ర విజయ వేడుకలో పాల్గొని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చకు దారితీశాయి.తన సుదీర్ఘ సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకున్న మోహన్ బాబు.. ఎంతోమంది దర్శకులతో కలిసి పనిచేశానని తెలిపారు. అయితే శ్రీకాంత్ ఓదెల పనితీరు తనను ప్రత్యేకంగా ఆకట్టుకుందని ప్రశంసించారు. శ్రీకాంత్‌లో అసాధారణ ప్రతిభ ఉందని, భవిష్యత్తులో ఆయన అగ్రశ్రేణి దర్శకుడిగా ఎదిగే సామర్థ్యం ఉందని అన్నారు.
శ్రీకాంత్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. కచ్చితంగా గొప్ప దర్శకుడిగా ఎదుగుతావని మోహన్ బాబు అభినందించారు. సినీ పరిశ్రమ ఎవరి సొంతం కాదని, ప్రతిభ, కష్టపడి పనిచేసే తత్వం, అంకితభావం ఉన్నవారికి ఎప్పటికైనా గుర్తింపు లభిస్తుందని వ్యాఖ్యానించారు. నేపథ్యం లేదా గాడ్ఫాదర్లు ఉన్నంత మాత్రాన ఎవరూ శాశ్వతంగా నిలబడలేరని, స్వయంకృషితో ఎదిగిన ఎంతోమంది కళాకారులు పరిశ్రమలో తమదైన ముద్ర వేశారని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో మోహన్ బాబు చేసిన మరో వ్యాఖ్య ఇప్పుడు ఎక్కువగా చర్చకు కారణమైంది. కొంతమందికి కేవలం డ్యాన్స్ చేయడం మాత్రమే తెలుసని, అసలైన నటనలో భాగమైన నవరసాలను పలికించడం, కళ్లతో హావభావాలు వ్యక్తం చేయడం వంటి అంశాల్లో అందరూ ఒకే స్థాయిలో ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. అదే సమయంలో నానిలో మాత్రం అన్ని రసాలను పండించగలిగే సంపూర్ణ నటుడు ఉన్నాడని ప్రశంసించారు.
నాని నటనపై మోహన్ బాబు చేసిన ప్రశంసలు కూడా ప్రత్యేకంగా నిలిచాయి. ‘ది ప్యారడైజ్’లో నాని తన పాత్రను బలంగా ఆవిష్కరించారని, నటుడిగా ఆయనలోని వైవిధ్యాన్ని సినిమా మరోసారి చూపించిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే మోహన్ బాబు తన వ్యాఖ్యల్లో ఏ ఒక్క హీరో పేరు కానీ, వ్యక్తి పేరు కానీ నేరుగా ప్రస్తావించలేదు. ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో మాత్రం రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ‘ఇండస్ట్రీ ఎవరి సొంతం కాదు’, ‘కొంతమందికి డ్యాన్స్ తప్ప నటన రాదు’ అనే వ్యాఖ్యలను ఆయన ఎవరిని ఉద్దేశించి చేశారనే విషయంపై నెటిజన్లు తమకు తోచిన విధంగా అర్థాలు వెతుక్కుంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasoju Shravan Kumar | రేవంత్ రెడ్డి అనే మహమ్మారి వచ్చినంక కరెంట్ కూడా పూర్తిగా సర్వనాశనమైపోతుంది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్
‘అర్హులైన గ్రాడ్యూయేట్లను ఓటర్లుగా నమోదు చేయించాలి’
Imran Khan | దేశం వీడాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసులు.. ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా నిబంధనలు ఇవే!
Puneeth Rajkumar: గంటన్నర పాటు కిక్ బాక్సింగ్.. పునీత్ రాజ్‌కుమార్ చివరి క్షణాలు గురించి చెప్పిన డాక్టర్
‘పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా కల్యాణలక్ష్మి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

