DC Box Office | కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా అరంగేట్రం చేసిన తొలి చిత్రం ‘డీసీ’ బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతోంది. అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ తమిళ యాక్షన్ డ్రామా ఇండియన్ మార్కెట్లో మొదటి రోజు నుంచే మంచి వసుళ్లను రాబడుతున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ డేనే రూ. 6 కోట్లకు పైగా వసుళ్లను రాబట్టిన ఈ చిత్రం అనంతరం వరుసగా కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. తాజాగా ఆరో రోజు కూడా బాక్సాఫీస్ వద్ద తన జోరును కొనసాగించింది. వర్కింగ్ డేస్‌లోనూ ఈ చిత్రం పట్టుసడలించకుండా మంచి వసూళ్లను రాబడుతోంది. కేవలం ఆరో రోజే భారతదేశంలో సుమారు రూ. 5 కోట్లు నెట్ రాబట్టగా, ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్లు రూ. 58.62 కోట్లకు పైగా చేరుకున్నాయి. వీకెండ్ కల్లా ఈ చిత్రం రూ. 60 కోట్ల మార్క్‌ను దాటే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న లోకేష్ కనగరాజ్, ఈ చిత్రంతో పూర్తి స్థాయి నటుడిగా మారడం విశేషం. ప్రస్తుతం లోకేష్ అల్లు అర్జున్‌తో ‘ఏఏ23’ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు.