Vantara: ఏనుగుల సంక్షేమం.. సంరక్షణ.. విస్తరిస్తున్న వంతార
VANTARA: మూగజీవాలకు ప్రాణదాతగా నిలుస్తున్నారు అనంత్ అంబానీ. వంతార ఎన్జీవోతో గజరాజులను ఆదుకుంటున్నారు. ఏనుగుల సంక్షేమం, సంరక్షణకు వంతార ఓ దేవాలయంగా మారింది. తాజాగా రాజస్థాన్‌లోని హాతీగావ్లో కొత్త సెంటర్‌ను ఓపెన్ చేశారు. లీలావతి ఏనుగు స్టోరీపై క్విజ్ పోటీ నిర్వహిస్తున్నారు. ఇక ఆఫ్రికా దేశాల్లోని ఏనుగ రాష్ట్రాలకు కూడా నిధులు అందిస్తోంది ఆ సంస్థ.
జామ్‌నగర్: గజరాజులకు తోడునీడగా నిలుస్తోంది వంతార(Vantara) ఎన్జీవో. అనంత్ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం.. ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకున్నది. గుజరాత్ నుంచి ప్రారంభమైన వంతార ఇప్పుడు మరిన్ని రాష్ట్రాలకు పాకింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం మూగజీవాలకు బాసటగా మారుతోంది. ఏనుగుల సంక్షేమం, సంరక్షణ విద్య, అంతర్జాతీయ సహకారంతో వంతార కేంద్రం ఏనుగుల రక్షణకు పాటుపడుతున్నది. ప్రస్తుతం వంతార సంరక్షణలో సుమారు 260 ఆసియా ఏనుగులు ఉన్నాయి. ఏనుగుల సంరక్షణ చూసుకుంటున్న అతిపెద్ద సెంటర్‌గా మారింది. వంతార ప్రగతిబాటలో ఏనుగులకు ప్రత్యేక స్థానం ఉన్నది. వంటరైన జంతువులను రక్షించి, వాటికి ప్రత్యేక కేర్ తీసుకోవడం, వాటి జీవితాలను మెరుగుపరచడమే వంతార టార్గెట్. గౌరి అనే ఏనుగును తొలుత అనంత్ అంబానీ రక్షించారు. ఆ ఏనుగుతోనే వంతార జర్నీ ప్రారంభమైంది.
ఏనుగులకు నా గుండెల్లో ప్రత్యేక స్థానం ఉందని, వంతార జర్నీలో అవి కీలకమైనవని అనంత్ అంబానీ న్నారు. మా సెంటర్లో ఉన్న ప్రతి ఏనుగుకు ఓ కథ ఉందని, వాటి సంరక్షణ మా బాధ్యత అని అన్నారు. ఆ జంతువులను రక్షించి, వాటి సంక్షేమాన్ని చూడడమే బాధ్యతగా భావిస్తామన్నారు. గౌరి ఏనుగును రక్షించిన తర్వాత.. గజరాజుల సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నాం. ఏనుగుల కేర్ తీసుకుంటున్న వారికి సపోర్టు చేస్తున్నామని, ఏనుగులను ఎలా పెంచాలి, వాటితో ఎలా మెలగాలన్న పాఠాలను కూడా నేర్పుతున్నామన్నారు. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఏనుగుల సంరక్షణ చూసుకుంటున్నామని అనంత్ అంబానీ అన్నారు. ఆగస్టు 12వ తేదీన ప్రపంచ ఎలిఫెంట్ డే నిర్వహించామని, ఆ అద్భుత జంతువుల రక్షణకు, వాటి భవిష్యత్తుకు తాము కట్టుబడి ఉన్నామన్నారు.
కొత్తగా ఇప్పుడు రాజస్థాన్‌లోని వంతార కేంద్రాన్ని స్టార్ట్ చేశారు. జైపూర్‌లోని హాతీ గావ్‌లో ఏనుగుల కేరింగ్ తీసుకుంటున్నట్లు ఆ రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి సంజయ్ శర్మ తెలిపారు. దీని కోసం వంతారతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏనుగుల సంరక్షణ కోసం జైపూర్‌లో ప్రపంచ స్థాయి ఎలిఫెంట్ ట్రీట్మెంట్ అండ్ కేర్ ఫెసిలిటీని ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. ఈ సెంటర్లో అడ్వాన్స్డ్ ఆస్పిటల్, న్యూట్రిషన్ సెంటర్, హైడ్రోథెరపి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇక వృద్ధి ఏనుగుల కోసం ప్రత్యేకంగా రిటైర్మెంట్ అండ్ కేర్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి సంజయ్ శర్మ చెప్పారు.
రాజస్థాన్ అటవీ శాఖ, వంతార అనుభవంతో.. ఏనుగులను ప్రతి దశలోనూ సంరక్షించనున్నారు. గజరాజుల అవసరాలను ప్రతి దశలోనూ తీర్చనున్నట్లు చెప్పారు. హాతీ గావ్‌లో ఏనుగులు సంతోషంగా, సుఖంగా తమ జీవితాలను గడిపే రీతిలో ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దేశంలోని పలు రాష్ట్రాలతోనూ వంతార భాగస్వామ్యాన్ని ఏర్పర్చుకున్నది. అస్సాం, అరుణాచల్ ప్రదేవ్, త్రిపుర, అండమాన్ నికోబార్ దీవుల్లోని 8 ప్రాంతాల్లో భారీ ఎత్తున ఏనుగుల సంక్షేమ ప్రోగ్రామ్‌ను పూర్తి చేసినట్లు వంతార పేర్కొన్నది. ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా వెటర్నరీ కేర్ తీసుకున్నారు. ఏనుగుల ఆరోగ్యం గురించి, మనుషులతో ప్రవర్తించే విధానం గురించి, ఫస్ట్ ఎయిడ్ మేనేజ్మెంట్ కూడా నేర్పించారు. ఏనుగులకు పౌష్టిక ఆహారం ఎలా అందించాలో కూడా ఆ ప్రోగ్రామ్‌లో చెప్పారు. వెటర్నరీ, వెల్ఫేర్ కిట్స్ అందించారు. వివిధ రకాల భాగస్వామ్యాలు, కార్యక్రమాలతో.. దేశంలో ఉన్న ఏనుగుల సంక్షేమం, సంరక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్నామని వంతార పేర్కొన్నది.
మై ఫ్రెండ్ లీలావతి..
మై ఫ్రెండ్ లీలావతి అనే ప్రోగ్రామ్‌ను మొదలుపెట్టినట్లు వంతార పేర్కొన్నది. సోషల్ మీడియా ద్వారా చిన్నారుల్లో ఏనుగల పట్ల ప్రేమ, దయను పొందించే రీతిలో ఆ కార్యక్రమాన్ని రూపొందించారు. వంతారలో ఉన్న లీలావతి అనే ఏనుగు స్టోరీని ఆ క్యాంపేన్ ద్వారా చిన్నారులకు తెలియజేయనున్నారు. తల్లి నుంచి చిన్నప్పుడే దూరమైన లీలావతి, కొన్నేళ్లు సర్కస్‌లో గడిపింది, ఆ తర్వాత అగ్నిప్రమాదంలో దానికి తీవ్ర గాయాలయ్యాయి. వంతారలో లీలావతిని ప్రతి ఒక్కరూ ప్రేమగా చూసుకుంటారు. ఆ ఏనుగు స్టోరీ చెప్పడం వల్ల.. చిన్నారుల్లో ఏనుగల పట్ల దయ, కరుణ, ప్రేమ పెరుగుతాయని వంతార పేర్కొన్నది. మై ఫ్రెండ్ లీలావతి పేరుతో ఫజిల్‌ను కూడా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విజేతలకు లీలావతి గిఫ్ట్ ఇవ్వనున్నారు. వారికి వంతారను విజిట్ చేసే అవకాశాన్ని కూడా కల్పించనున్నారు.
ఏనుగులు, మనుషుల మధ్య సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఎలిఫెంట్ ప్రొటెక్షన్ ఇన్సియేటివ్(ఈపీఐ) ఫౌండేషన్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ ఫౌండేషన్ ద్వారా నిధులు ఇవ్వనున్నారు. ఏనుగుల సంరక్షణ గురించి ఆసియా, ఆఫ్రికా దేశాల్లోని ఎలిఫెంట్ రేంజ్ రాష్ట్రాలకు ఈ నిధులను అందించనున్నారు. అయితే ఏనుగుల సంరక్షణపై అంతర్జాతీయ సదస్సును 2027 మార్చిలో బ్యాంకాక్‌లో నిర్వహించనున్నారు. 13 ఏషియన్ ఎలిఫెంట్ రేంజ్ రాష్ట్రాలు, 5 ఆఫ్రికా ఎలిఫెంట్ రేంజ్ రాష్ట్రాలకు ఈపీఐ ఫౌండేషన్ నిధులను ఇవ్వనున్నది. ఈపీఐ యూత్ అంబాసిడర్ ప్రోగ్రామ్‌ను కూడా తొలిసారి నిర్వహిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

