Watch: సెలవు నిరాకరించిన అధికారి.. పరిస్థితి వివరించేందుకు ప్యాంటు విప్పిన రైల్వే ఉద్యోగి
Loco Pilot Takes Pants Off | రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్న వ్యక్తి పైల్స్‌తో బాధపడుతున్నాడు. దీనికి సర్జరీ చేయించుకున్నాడు. కోలుకోకపోవడంతో సెలవు పొడిగించాలని కోరాడు. అధికారి నిరాకరించడంతో తన పరిస్థితిని వివరించేందుకు ప్యాంటు విప్పి చూపించాడు.
లక్నో: రైల్వేలో లోకో పైలట్‌గా పని చేస్తున్న వ్యక్తి పైల్స్‌తో బాధపడుతున్నాడు. దీనికి సర్జరీ చేయించుకున్నాడు. కోలుకోకపోవడంతో సెలవు పొడిగించాలని కోరాడు. అధికారి నిరాకరించడంతో తన పరిస్థితిని వివరించేందుకు ప్యాంటు విప్పి చూపించాడు. (Loco Pilot Takes Pants Off) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన జరిగింది. రైల్వేలో లోకో పైలట్‌గా రాజేష్ మీనా పని చేస్తున్నాడు. చాలా కాలంగా పైల్స్‌తో అతడు బాధపడుతున్నాడు. ఫిబ్రవరి 22న లక్నోలోని ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నాడు. దీని కోసం ఫిబ్రవరి 28 వరకు సెలవు పొందాడు.
కాగా, రాజేష్ మీనాకు మంజూరు చేసిన సెలవులు ముగిశాయి. అయితే పైల్స్‌కు చేసిన సర్జరీ గాయం మానలేదు. దీంతో సెలవు పొడిగింపు కోసం రైల్వే హెల్త్ యూనిట్‌ను అతడు సంప్రదించాడు. పరీక్షించిన వైద్యులు మరింత విశ్రాంతి అవసరమని అంగీకరించారు. ఉన్నతాధికారుల నుంచి ‘సిక్ మెమో’ పొందాలని సూచించారు.
మరోవైపు సెలవు పొడిగింపు కోసం క్రూ కంట్రోలర్‌తో పాటు చీఫ్ క్రూ కంట్రోలర్ అయిన రతన్ కుమార్‌ను రాజేష్ మీనా సంప్రదించాడు. పైల్స్ సర్జరీ పత్రాలు, ప్రిస్క్రిప్షన్లు, ల్యాబ్ నివేదికలు, డ్రెస్సింగ్లతో సహా అన్నింటిని ఆధారాలుగా అధికారికి చూపించాడు. అయినప్పటికీ సెలవు మెమో ఇవ్వడానికి ఆ అధికారి నిరాకరించాడు. దీంతో ఆగ్రహించిన రాజేష్ మీనా ప్యాంటు విప్పి పైల్స్ సర్జరీ గాయాన్ని ఆ అధికారికి చూపించాడు.
కాగా, యూనియన్ నేత జోక్యంతో చివరకు రాజేష్ మీనాకు సెలవు పొడిగింపు మంజూరైంది. అయితే ఈ సంఘటనపై రైల్వే లోకో పైలట్స్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. అనారోగ్యం నేపథ్యంలో సెలవు పొడిగింపు కోరిన రైల్వే ఉద్యోగిని అవమానించిన ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాజేష్ మీనా అనుచరుడు రికార్డ్ చేసిన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
A Railway loco pilot suffering from piles was asked to show evidence of the medical issue to get his sick leave approved. He did. pic.twitter.com/kzMXiD80tv
— Piyush Rai (@Benarasiyaa) March 4, 2026
Also Read:
Rohini Acharya | నితీశ్ కీలుబొమ్మ.. మిత్రులను మోసం చేసినందుకు మూల్యం: రోహిణి ఆచార్య
Woman Gang-Raped | పిల్లల ముందే మహిళపై సామూహిక అత్యాచారం.. ఇద్దరు అరెస్ట్
Watch: హోలీ నాడు రంగులు చల్లిన బాలుడు.. మనవడిపై వేడినీరు పోసిన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

