Rohini Acharya | నితీశ్ కీలుబొమ్మ.. మిత్రులను మోసం చేసినందుకు మూల్యం: రోహిణి ఆచార్య
Rohini Acharya | రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ మాజీ నాయకురాలు రోహిణి ఆచార్య మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మ అని విమర్శించారు. మిత్రులను మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారని ఆరోపించారు.
పాట్నా: రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బీహార్ సీఎం నితీశ్ కుమార్‌పై ఆర్జేడీ మాజీ నాయకురాలు రోహిణి ఆచార్య (Rohini Acharya) మండిపడ్డారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మ అని విమర్శించారు. మిత్రులను మోసం చేసినందుకు తగిన మూల్యం చెల్లించుకున్నారని ఆరోపించారు. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో మహాకూటమి ఓటమి నేపథ్యంలో జరిగిన కలహాల వల్ల లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య ఆ పార్టీతోపాటు కుటుంబంతో తెగదెంపులు చేసుకున్నారు.
కాగా, నితీశ్ కుమార్ రాజ్యసభకు పోటీ చేయడంపై తాజాగా ఎక్స్ పోస్ట్‌లో ఆమె స్పందించారు. బీజేపీ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారారని రోహిణి ఆచార్య విమర్శించారు. రాజకీయ భాగస్వాములను పదే పదే ‘ద్రోహం’ చేయడం వల్ల కలిగే పరిణామాలను ఆయన ఎదుర్కొంటున్నారని మండిపడ్డారు.
మరోవైపు నితీశ్ కుమార్ పట్ల బీజేపీ చెడుగా ప్రవర్తించిందని, రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయమని ఆయనను బలవంతం చేసిందని రోహిణి ఆచార్య ఆరోపించారు. నితీశ్ ప్రస్తుత రాజకీయ పరిస్థితికి ఆయనే కారణమని మండిపడ్డారు. నితీశ్ కుమార్ అవకాశవాద రాజకీయాలకు ఇది పరాకాష్ట అని, తగిన మూల్యం చెల్లించుకున్నారని ఎక్స్ పోస్ట్‌లో ఆమె విమర్శించారు.
Also Read:
Sharad Pawar | మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటు.. శరద్ పవార్ పోటీ
Loco Pilot Refuses To Work | పని గంటలు ముగిశాయని.. రైలు నడిపేందుకు నిరాకరించిన లోకో పైలట్
Watch: హోలీ నాడు రంగులు చల్లిన బాలుడు.. మనవడిపై వేడినీరు పోసిన మహిళ
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- allies
- betraying
- BJP
- Nitish Kumar
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్‌కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్‌కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

