ఎదులాపురం, ఆగస్టు 10 : ఆదిలాబాద్ సి మెంట్ పరిశ్రమ పునఃప్రారంభం కోసం చేస్తు న్న ఉద్యమానికి గ్రామాల నుంచి మద్దతు పె రుగుతున్నది. ఇందులో భాగంగా రెండో రో జు నిర్వహించిన రిలే నిరాహార దీక్షలో చాం ద గ్రామస్తులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. దీక్షలో పాల్గొన్న గ్రామస్తులను మాజీ మంత్రి జోగు రామన్న అభినందించా రు. ఈ సందర్భంగా రామన్న మాట్లాడుతూ.. రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో సీసీఐ సాధన కమిటీతో కలిసి కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రితో చర్చలు జరిపినట్లు తెలిపారు.
ఆ సందర్భంగా ఆదిలాబాద్ సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభిస్తామని కేంద్ర మంత్రి స్పష్టత ఇచ్చారని పేరొన్నారు. అయితే కేంద్ర మంత్రి ఇచ్చిన హామీపై స్థానిక బీజేపీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కమిషన్ల కోసమే సీసీఐ పునఃప్రారంభాన్ని అడ్డుకుంటున్నారనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.250 కోట్లు కేటాయిస్తే సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించే అవకాశం ఉందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిసినా పరిశ్రమ పునఃప్రారంభంపై నిర్లక్ష్యం చేయడం బాధాకరమన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ సీసీఐ పరిశ్రమను పునఃప్రారంభించేందుకు అవకాశం కల్పించాలని, పరిశ్రమను రాష్ర్టానికి అప్పగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు గుర్తు చేశారు. ఆదిలాబాద్ యువతకు స్థానికంగానే ఉద్యోగ అవకాశాలు కల్పించేలా సీసీఐ సాధన సమితి చేస్తున్న ఉద్యమానికి స్థానిక ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ మద్దతుగా నిలిచి కేంద్ర మంత్రులతో చర్చలు జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పరిశ్రమ పునఃప్రారంభమయ్యే వరకు బీఆర్ఎస్ పార్టీ సీసీఐ సాధన సమితితో కలిసి నిరంతరం పోరాటం కొనసాగిస్తుందని జోగు రామన్న స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో చాందా గ్రామానికి చెందిన కత్తురి అఖిలేష్, జవ్వాజి దయానంద్, తెడోజీ విజయ్ కుమార్, గండ్రత్ శ్రీనివాస్, గండ్రత్ దేవన్న, చిదం ప్రభాకర్, బండారి గంగయ్య, అరె రాజన్న, నగేష్, అంజన్న, అశోక్, ఉషన్న, గుండ్రత్ దేవీందర్, రమాకాంత్, అరె రవి, చిందం బసాయి, ఆసరా వెంకటి, తరుడి గాజు, బొజ్జ శ్రీకాంత్, బీజ్జా సాయి, దేవర్తి దేవీందర్, కత్తురి సుభాష్, చిందం ఆడేళ్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.