తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
వినాయక చవితి పర్వదినాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించి, సర్వకార్యాల్లో విజయాలను చేకూర్చే దైవంగా హిందూ సమాజం వినాయకుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తుందని పేర్కొన్నారు. భారతీయ సనాతన సంప్రదాయంలో ఏ శుభకార్యం, దైవపూజ లేదా ధార్మిక క్రతువు తలపెట్టినా తొలుత విఘ్నేశ్వరుడి ఆరాధనతోనే ప్రారంభించే విశిష్ట సంస్కృతి మనదని గుర్తుచేశారు.
- రాష్ట్ర ప్రజలందరి జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలి
- ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 13(నమస్తే తెలంగాణ): వినాయక చవితి పర్వదినాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు శుభాకాంక్షలు తెలియజేశారు. విఘ్నాలను తొలగించి, సర్వకార్యాల్లో విజయాలను చేకూర్చే దైవంగా హిందూ సమాజం వినాయకుడిని భక్తిశ్రద్ధలతో కొలుస్తుందని పేర్కొన్నారు. భారతీయ సనాతన సంప్రదాయంలో ఏ శుభకార్యం, దైవపూజ లేదా ధార్మిక క్రతువు తలపెట్టినా తొలుత విఘ్నేశ్వరుడి ఆరాధనతోనే ప్రారంభించే విశిష్ట సంస్కృతి మనదని గుర్తుచేశారు. అందుకే హిందూ సంప్రదాయాల్లో గణనాయకునికి అగ్రతాంబూలం, తొలి ప్రాధాన్యత దకుతాయని వివరించారు.
రాష్ట్రవ్యాప్తంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా వాడవాడలా గణపతి మండపాలను ఏర్పాటు చేసి, తొమ్మిది రోజులపాటు నవరాత్రుల ఉత్సవాలను చిన్నారులు, పెద్దలు ఎంతో ఉత్సాహం, భక్తిప్రపత్తులతో నిర్వహించుకుంటారని తెలిపారు. ఈ పవిత్ర పర్వదిన వేళ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజల జీవితాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని కేసీఆర్ ఆకాంక్షించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం తిరిగి గాడినపడి, సమృద్ధిగా వర్షాలు కురిసి, పాడిపంటలతో తెలంగాణ రైతు కుటుంబాలన్నీ సుఖసంతోషాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆ ఏకదంతుడిని మనసారా ప్రార్థిస్తున్న ట్టు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- BRS
- Ganesh Chaturthi
- KCR
- Telangana
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

