చర్చకు భయపడి పారిపోయిన సర్కార్
వెయ్యి రోజుల పాలనలో చెప్పుకొనేందుకు ఒక విజయమూ లేకనే పాలకపక్షం చర్చలకు భయపడి పారిపోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ సరార్పై విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా చూడని విధంగా శాసనసభ, మండలి ఆవరణల్లో వందలాది పోలీసుల పహారాతో ప్రజాప్రతినిధులను తీవ్ర నిర్బంధంలోకి నెట్టారని నిప్పులుచెరిగారు. గులాబీ రంగు టీ-షర్ట్ వేసుకున్నందుకు తనను తొలిరోజే సభలో కి రానివ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
- మండలి సాక్షిగా కాంగ్రెస్ డొల్లతనం బట్టబయలు
- 20 అంశాలను చర్చకు ప్రతిపాదిస్తే పట్టించుకోలే
- ప్రత్యక్ష ప్రసారాల్లో కూడా వివక్ష చూపించారు
- హామీలు మరచి బిల్లుల ఆమోదానికే పరిమితం
- శాసనమండలిలో ప్రజాస్వామ్యం ఖూనీపై మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజం
హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : వెయ్యి రోజుల పాలనలో చెప్పుకొనేందుకు ఒక విజయమూ లేకనే పాలకపక్షం చర్చలకు భయపడి పారిపోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి కాంగ్రెస్ సరార్పై విరుచుకుపడ్డారు. ఆదివారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా చూడని విధంగా శాసనసభ, మండలి ఆవరణల్లో వందలాది పోలీసుల పహారాతో ప్రజాప్రతినిధులను తీవ్ర నిర్బంధంలోకి నెట్టారని నిప్పులుచెరిగారు. గులాబీ రంగు టీ-షర్ట్ వేసుకున్నందుకు తనను తొలిరోజే సభలో కి రానివ్వకుండా అడ్డుకున్నారని ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలి
ఆరు రోజుల సమావేశాల్లో ఏ ఒక షార్ట్ డిసషన్ కూడా సరిగా జరుగలేదని, అందుకు సీఎం రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని సిరికొండ డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం బిల్లుల ఆమోదానికే ప్రాధాన్యమిచ్చి, 20 అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరసరించిందని పేర్కొన్నారు. లైవ్ ప్రసారాల్లో తమకు కవరేజ్ ఇవ్వకుండా వివక్ష చూపారని ధ్వజమెత్తారు. తాము ఇచ్చిన ఆరు వాయిదా తీర్మానాలను తిరసరించడమే కా కుండా, క్యూర్ బిల్లును చదువుకొనే సమ యం ఇవ్వకుండా నాలుగున్నర గంటలు సాగదీసి బిల్లులను ఆమోదించుకున్నారని మండిపడ్డారు.
సర్కార్ నిర్బంధకాండ : వాణీదేవి
కాంగ్రెస్ ప్రభుత్వ అప్రజాస్వామిక వైఖరిపై ఎమ్మెల్సీ సురభి వాణీదేవి నిప్పులు చెరిగారు. మండలి సమావేశాలను ప్రభుత్వం ఒక ప్రహసనంలా మార్చేసిందని, సభ్యుల ప్రాథమిక హకులను కాలరాసిందని విమర్శించారు. కేవలం 40మంది ప్రజాప్రతినిధుల చుట్టూ ఏకంగా 500మంది పోలీసులను మోహరించి అసెంబ్లీని ఒక పోలీస్ శిబిరంగా మార్చారని ఆమె దుయ్యబట్టారు. ప్రజాప్రతినిధులకు, అందునా మహిళా ప్రజాప్రతినిధులకు దకాల్సిన కనీస గౌరవం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఇకడ న్యాయం జరుగకపోవడంతో తాము దేశ రాజధాని ఢిల్లీ దాకా వెళ్లాల్సి రావడం రాష్ట్ర ప్రతిష్టకే తీరని అవమానమని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
రేవంత్ పతనం ఖాయం : దేశపతి శ్రీనివాస్
కంచెలు లేని పాలన, సస్పెన్షన్లు లేని సభ లు, ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం అంటూ ప్రగల్భాలు పలికిన రేవంత్ పాలనలో విజన్ లేదు, వజన్ కూడా లేదని ఎమ్మెల్సీ దేశపతి శ్రీ నివాస్ విమర్శించారు. కేసీఆర్ ఇంటిపైకే దాడి కి పిలుపునిచ్చే దుర్మార్గ సంసృతి మొదలుపెట్టారని, రేవంత్రెడ్డి పతనం ఖాయమైందని హెచ్చరించారు. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపైనా, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపైనా మాట్లాడే ధైర్యం ప్రభుత్వానికి లేకపోయిందని ఎద్దేవా చేశారు.
రేవంత్ పాలనలోఎమర్జెన్సీ రోజులను తెచ్చిన్రు : ఎల్ రమణ
కాంగ్రెస్ పాలన ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను తలపిస్తున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ విమర్శించారు. సమావేశాల తొలి రోజే అసెంబ్లీ వద్ద పోలీసులు ప్రవర్తించిన అమానుష తీరుపై ప్రజా వ్యతిరేకతకు దారితీసిందని మండిపడ్డారు. ఏకంగా ప్రజాప్రతినిధుల పైనే అక్రమంగా లైంగిక వేధింపుల కేసులు బనాయించడం తెలంగాణ రాజకీయ చరిత్రలోనే అత్యంత చీకటి అధ్యాయమని ధ్వజమెత్తారు. సభను సజావుగా నడిపే ఉద్దేశం మొదటినుంచీ ప్రభుత్వానికి లేదని, పోలీసులను ముందుపెట్టి విపక్షాలను అణచివేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని రమణ విమర్శించారు. ఏకపక్షంగా తమ ఇద్దరు సభ్యులను అప్రజాస్వామికంగా సస్పెండ్ చేశారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dubai ETCA | దుబాయ్లో ఘనంగా ETCA 16వ బతుకమ్మ సంబరాలు.. 6 వేల మందికిపైగా తెలంగాణ ప్రవాసుల భాగస్వామ్యం
కరెంట్ సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి
Rahul Gandhi | ఇండియా బ్లాక్ పార్టీలకు హైటీ ఏర్పాటు చేసిన రాహుల్.. సీఈసీకి వ్యతిరేకంగా చేపట్టాల్సిన పోరుపై చర్చ
Aishwarya | ‘మీరు ఎంతమందిని చంపుతున్నారు.. ఐశ్వర్య మృతికి కారణం డాక్టర్ల నిర్లక్ష్యమే’
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

