Sharad Pawar | మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటు.. శరద్ పవార్ పోటీ
Sharad Pawar | మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ పోటీ చేస్తున్నారు. మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి ఆయనను ఎంపిక చేసింది.
ముంబై: మహారాష్ట్రలో ప్రతిపక్షం గెలిచే ఏకైక రాజ్యసభ సీటులో నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) పోటీ చేస్తున్నారు. మహా వికాస్ అఘాడి (ఎంవీఏ) కూటమి అభ్యర్థిగా ఆయనను ఎంపిక చేసింది. సీనియర్ రాజకీయ నాయకుడైన శరద్ పవార్ రాజ్యసభ ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రతిపక్ష అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన కుమార్తె, ఎంపీ సుప్రియా సులే తెలిపారు. రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఉద్ధవ్ ఠాక్రేతో చర్చలు జరిపినట్లు ఆమె చెప్పారు.
కాగా, తన తండ్రి శరద్ పవార్‌కు మద్దతుఇచ్చిన కాంగ్రెస్, శివనేన (యూబీటీ) పార్టీలకు సుప్రియా సులే కృతజ్ఞతలు తెలిపారు. ‘జయంత్ పాటిల్, నేను కలిసి ఉద్ధవ్ ఠాక్రేను కలిసి చర్చించాం. శరద్ పవార్‌కు మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్, శివసేన (యూటీబీ)లకు ఎన్సీపీ (ఎస్పీ) కృతజ్ఞతలు తెలుపుతోంది’ అని మీడియాతో ఆమె అన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేత హర్షవర్ధన్ సప్కల్ కూడా ఈ విషయాన్ని ధృవీకరించారు. శరద్ పవార్‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నిర్ణయించిందని చెప్పారు. మార్చి 16న రాజ్యసభ ఎన్నికలు జరుగనున్నాయి.
Also Read:
Mehbooba Mufti | నెతన్యాహు, ట్రంప్ పోస్టర్లకు.. నిప్పంటించిన మెహబూబా ముఫ్తీ
techie dies by suicide | వంట విషయంలో అత్తతో గొడవ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Watch: లిఫ్ట్‌లో తలెత్తిన సమస్య.. వ్యక్తికి తృటిలో తప్పిన ముప్పు
Watch: రెండుసార్లు పడినప్పటికీ.. కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ యత్నం
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Lone
- Maharashtra
- Opposition
- Pick
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

