Mehbooba Mufti | నెతన్యాహు, ట్రంప్ పోస్టర్లకు.. నిప్పంటించిన మెహబూబా ముఫ్తీ
Mehbooba Mufti | అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతం కావడంపై జమ్ముకశ్మీర్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీనగర్‌లో జరిగిన నిరసనలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ పాల్గొన్నారు.
శ్రీనగర్: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హతం కావడంపై జమ్ముకశ్మీర్‌లో నిరసనలు కొనసాగుతున్నాయి. బుధవారం శ్రీనగర్‌లో జరిగిన నిరసనలో పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ) అధినేత్రి మెహబూబా ముఫ్తీ (Mehbooba Mufti) పాల్గొన్నారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పోస్టర్లకు నిప్పంటించి తగలబెట్టారు. 2019లో మరణించిన అమెరికన్ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ ఫొటో కూడా ఆ పోస్టర్లో ఉన్నది.
కాగా, అమెరికా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, ఖమేనీకి మద్దతుగా మెహబూబా ముఫ్తీ నినాదాలు చేశారు. ఆ తర్వాత ఈ వీడియో క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇరాన్‌కు అనుకూలంగా పోస్ట్ చేశారు. ‘మీకు న్యాయం జరిగే వరకు శాంతియుతంగా నిలబడే వారితో శాంతియుతంగా, మిమ్మల్ని వ్యతిరేకించే వారి పట్ల వ్యతిరేకంగా నేను ఉంటా’ అని అందులో పేర్కొన్నారు.
మరోవైపు భారత్, జమ్ముకశ్మీర్ ప్రభుత్వాలు ఖమేనీ హత్యపై మౌనంగా ఉన్నాయని మెహబూబా ముఫ్తీ విమర్శించారు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు, దారుణాలపై మాట్లాడే వారిని నేరస్తులుగా పరిగణించి కేసులు నమోదు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.
“I stand in peace with those who stand in peace with you, and in opposition to those who oppose you, until the Day of Judgment.” pic.twitter.com/NyDSuOWQVa
— Mehbooba Mufti (@MehboobaMufti) March 4, 2026
Also Read:
techie dies by suicide | వంట విషయంలో అత్తతో గొడవ.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
Watch: లిఫ్ట్‌లో తలెత్తిన సమస్య.. వ్యక్తికి తృటిలో తప్పిన ముప్పు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

