US Embassy in UAE closed | ఇరాన్ డ్రోన్ దాడుల ప్రభావం.. అబుదాబి, దుబాయ్‌లో అమెరికా కాన్సులేట్స్ మూత
US Embassy in UAE closed | గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్‌లు, రాయబార కార్యాలయాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్నది. డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. దీంతో అబుదాబిలోని అమెరికా రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వాటిని మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.
అబుదాబి: గల్ఫ్ దేశాల్లోని అమెరికా ఆర్మీ బేస్‌లు, రాయబార కార్యాలయాల లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తున్నది. డ్రోన్లతో విరుచుకుపడుతున్నది. దీంతో అబుదాబిలోని అమెరికా రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో వాటిని మూసివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. (US Embassy in UAE closed) బుధవారం తెల్లవారుజామున దుబాయ్‌లోని అమెరికా కాన్సులేట్ లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగింది. ఈ నేపథ్యంలో అబుదాబిలోని అమెరికా రాయబార కార్యాలయం, దుబాయ్ కాన్సులేట్‌ను మూసివేసినట్లు అమెరికా ప్రకటించింది. ‘విదేశీ పౌరులకు వీసా సేవలు సహా అన్ని ఇతర వ్యక్తిగత కాన్సులర్ సేవలు కూడా అందుబాటులో లేవు. ప్రస్తుతం విదేశీ పాస్‌పోర్ట్‌లను నిలిపివేస్తున్నాం. దయచేసి ఎట్టి పరిస్థితుల్లోనూ రాయబార కార్యాలయం లేదా కాన్సులేట్‌ను సంప్రదించవద్దు. అత్యవసర పరిస్థితుల్లో పేర్కొన్న సమాచారం ద్వారా మమ్మల్ని సంప్రదించండి’ అని యూఏఈలోని అమెరికా ఎంబసీ పేర్కొంది.
కాగా, గల్ఫ్ దేశాలపై ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగుతున్నాయి. దీంతో భద్రతా పరంగా యూఏఈలో లెవల్ 3 హెచ్చరికను అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ జారీ చేసింది. ‘జోర్డాన్, ఒమన్, సౌదీ అరేబియాతో పాటు యూఏఈలో భద్రతను లెవల్ 3కి పెంచాం. అమెరికా పౌరులు ఆయా దేశాలకు తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించుకోవాలి’ అని పేర్కొంది.
🚨🇺🇸🇦🇪 The US Consulate in Dubai, UAE just got hit by Iran pic.twitter.com/FyKjtKIZS4
— Concerned Citizen (@BGatesIsaPyscho) March 3, 2026
Also Read:
US Fighter Jets | అమెరికా యుద్ధ విమానాలను కువైటే కూల్చింది.. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
Israeli F-35: యాక్-130 ఫైటర్ జెట్‌ను కూల్చిన ఎఫ్-35: ఐడీఎఫ్
Ayatollah Ali Khamenei | ఈ రాత్రి నుంచి ప్రజా సందర్శనకు ఖమేనీ భౌతికకాయం.. అంత్యక్రియల ప్రక్రియ మొదలు
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

