US Fighter Jets | అమెరికా యుద్ధ విమానాలను కువైటే కూల్చింది.. ప్రాథమిక దర్యాప్తులో వెల్లడి
US Fighter Jets | ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా (USA) కు చెందిన మూడు ఎఫ్-15ఈ (F-15E) స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు కువైట్ (Kuwait) లో నేలకూలాయి.
US Fighter Jets : ఇరాన్ (Iran) తో అమెరికా (USA), ఇజ్రాయెల్ (Israel) యుద్ధం కారణంగా పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్ధంలో అమెరికా (USA) కు చెందిన మూడు ఎఫ్-15ఈ (F-15E) స్ట్రైక్ ఈగిల్ యుద్ధ విమానాలు కువైట్ (Kuwait) లో నేలకూలాయి. కువైట్‌కు చెందిన ఎఫ్/ఏ – 18 హార్నెట్ (F/A-18 Hornet) ఫైటర్‌జెట్ వీటిని కూల్చివేసిందని తాజాగా వెల్లడైంది. పొరపాటున ఈ ఘటన చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు వాల్‌స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొన్నది.
యుద్ధం ప్రారంభమైన మూడో రోజునే అమెరికా యుద్ధ విమానాలను కువైట్ కూల్చేసింది. ఎఫ్/ఏ- 18 హార్నెట్ పైలట్ పొరపాటున యూఎస్ ఫైటర్జెట్ల వైపు మూడు క్షిపణలను ప్రయోగించారని యూఎస్ అధికారి తెలిపారు. దాంతో ఆ విమానాలు కువైట్‌లో కూలిపోయాయన్నారు. ముగ్గురు పైలట్లు, ఇతర సిబ్బంది సురక్షితంగా బయటపడినట్లు చెప్పారు. యూఎస్ సెంట్రల్ కమాండ్ ఈ చర్యను ఫ్రెండ్లీ ఫైర్‌గా పేర్కొన్నది.
ఈ ఘటనను అంగీకరించిన కువైట్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు ప్రారంభించారు. అమెరికా ఫైటర్జెట్లను కూల్చివేసేందుకు దారితీసిన పరిస్థితులపై ఇంకా స్పష్టత రాలేదు. యూఎస్ ఫైటర్ జెట్లు కూలిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో ఒకటి గిరగిరా తిరుగుతూ నేల కూలింది. ఈ క్రమంలో దాని వెనుక భాగం నుంచి మంటలు వెలువడ్డాయి.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

