‘భువన విజయం’ తెలంగాణ భవన్
రాష్ట్ర ‘భువన విజయం’ తెలంగాణ భవన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ భవన్ నిర్మించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్' వేదికగా స్పందిస్తూ.. స్వ రాష్ట్ర ఆకాంక్షను చాటేలా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టేలా ఉద్యమకారులకు ఒక వేదికగా, సరిగ్గా 20 ఏండ్ల క్రితం అద్భుత కట్టడంలా తెలంగాణ భవన్ ప్రారంభమైనట్టు గుర్తుచేశారు.
- బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్‌కు రెండు దశాబ్దాలు పూర్తి
- ‘ఎక్స్’ వేదికగా కేటీఆర్,హరీశ్‌రావు ట్వీట్లు
హైదరాబాద్, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ‘భువన విజయం’ తెలంగాణ భవన్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభివర్ణించారు. తెలంగాణ భవన్ నిర్మించి రెండు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. స్వ రాష్ట్ర ఆకాంక్షను చాటేలా.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలబెట్టేలా ఉద్యమకారులకు ఒక వేదికగా, సరిగ్గా 20 ఏండ్ల క్రితం అద్భుత కట్టడంలా తెలంగాణ భవన్ ప్రారంభమైనట్టు గుర్తుచేశారు. ఉద్యమ సమయంలో వ్యూహ, ప్రతివ్యూహాల రచనలో.. దశాబ్ద కాలపు స్వరాష్ట్ర అప్రతిహత ప్రగతి ప్రస్థానంలో తెలంగాణ భవన్ది కీలక పాత్ర అని ఆయన కొనియాడారు. ఇవాళ కాంగ్రెస్ విఫల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఓ ‘జనతా గ్యారేజ్’లా మారడంలో తెలంగాణ భవన్ సాక్షీభూతంగా నిలిచిందని తెలిపారు. తెలంగాణ భవన్ రెండు దశాబ్దాల పూర్తి సందర్భంగా ఉద్యమకారులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలకు కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
నాడు ఉద్యమ వేదిక.. నేడు ‘జనతా గ్యారేజ్’: హరీశ్‌రావు
నాడు స్వరాష్ట్ర పోరులో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమ వేదిక ‘తెలంగాణ భవన్’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ.. నేడు ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకు కొండంత అండగా నిలుస్తూ.. వారి సమస్యలకు పరిష్కారం చూపే అసలైన ‘జనతా గ్యారేజ్’ అని అభివర్ణించారు. 20 ఏండ్లు పూర్తి చేసుకున్న ‘తెలంగాణ భవన్’ మన ఆత్మగౌరవ సూచిక అని హరీశ్‌రావు కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

