టాలీవుడ్లో వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతున్న ‘ముగ్గురు కోతులు’ సినిమాకు సంబంధించి మేకర్స్ మరో క్రేజీ అప్డేట్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణలో, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణలో శోభారాణి గరిమెల్ల నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, వర్షిక పాశం హీరోయిన్గా అలరించనుంది. ఇప్పటివరకు విడుదలైన ఈ చిత్రపు ఫస్ట్ లుక్ పోస్టర్లు మరియు ప్రచార చిత్రాలు ప్రేక్షకులు, సినీ వర్గాల్లో మంచి అంచనాలను క్రియేట్ చేశాయి. తాజాగా మాస్ ఆడియెన్స్‌ను థియేటర్లలో ఊర్రూతలూగించేలా ఒక అదిరిపోయే స్పెషల్ ఐటమ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ సిద్ధం చేసింది.
ప్రముఖ నటుడు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ స్వయంగా ఈ చిత్రంలోని ‘కో కో కొకొరొకో’ అంటూ సాగే స్పెషల్ సాంగ్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా పాటను వీక్షించిన ఆయన, చిత్ర యూనిట్ మొత్తానికి తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు. ‘కోకో కొకొరొకో’ అంటూ సాగే ఈ పాటకు జగదీష్ అందించిన సాహిత్యం ఎంతో క్యాచీగా, మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఎస్. సుహాస్ అందించిన బాణీలు శ్రోతలను ఇట్టే కట్టిపడేస్తుండగా, గాయని లాస్య ప్రియ తనదైన శైలిలో ఆలపించిన తీరు కుర్రకారును ఇన్‌స్టంట్‌గా ఊపేసేలా ఉంది. వినోద్, రఘు, సాయి సంయుక్తంగా కంపోజ్ చేసిన ఈ పాటలో ముగ్గురు హీరోలతో పాటు స్పెషల్ సాంగ్‌లో నర్సించిన నటీమణి వేసిన ఊరమాస్ స్టెప్పులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని యూనిట్ ధీమా వ్యక్తం చేసింది.
ఎస్. సుహాస్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి రాజ్ నోముల సినిమాటోగ్రఫీ, జమీర్ షేక్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా వస్తున్న ప్రతీ అప్డేట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుండగా, మున్ముందు మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్తో ప్రేక్షకులను అలరించేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో తేజ కొండపల్లి, గణేష్ బొడ్డ, దేవాన్ష్, వర్షిక పాశం తదితరులు నటిస్తుండగా.. జీఎస్ఆర్ క్రియేషన్స్ సమర్పణ, స్కై ఫ్లేర్ నెట్వర్క్స్ సహ సమర్పణ, శోభారాణి గరిమెల్ల నిర్మాతగా, కార్తీక్ గరిమెల్ల దర్శకత్వం, రాజ్ నోముల కెమెరామెన్, ఎస్. సుహాస్ సంగీతం, జమీర్ షేక్ ఎడిటింగ్, సాయి సతీష్ పీఆర్వోగా వ్యవహరిస్తున్నారు.