Viral Video | గ్రేటర్ నోయిడాలో నలుగురిపైకి దూసుకెళ్లిన కారు.. డ్రైవర్ అరెస్ట్
Viral Video : ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక కారు కొంతమందిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Viral Video : ఉత్తర ప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో ఒక కారు కొంతమందిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూస్తే కారు డ్రైవర్ ఉద్దేశపూర్వకంగానే కారుతో దాడి చేసినట్లు అర్థమవుతోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలివి.
యూపీ, గ్రేటర్ నోయిడాలోని, నాలెడ్జ్ పార్క్ పరిధిలో శనివారం ఉదయం ఒక కారు వేగంగా వచ్చి, రోడ్డు పక్కన ఉన్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. అందులో ఒకరికి ఎక్కువ గాయాలు కాగా.. మిగతా ముగ్గురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దాడి అనంతరం డ్రైవర్ కారుతో సహా అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనను అక్కడి వారెవరో వీడియో తీశారు.
🚨 GREATER NOIDA | CAR DRIVEN INTO STUDENTS
A car driver allegedly drove into students outside GNIOT College in Knowledge Park, Greater Noida.
One student was injured, while the driver fled the spot. pic.twitter.com/tT4SqqKaTR
— News Matrix (@NewsMatrixIND) September 19, 2026
ఈ ఘటనపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో నాలెడ్జ్ పార్క్ పరిధిలోని పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడైన డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, కారును సీజ్ చేశామని గ్రేటర్ నోయిడా డీసీపీ రవి శంకర్ నిమ్ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఓయూ, కేయూ వర్సిటీల పూర్వ విద్యార్థుల జాతీయ భావజాల సమ్మేళనానికి ఆహ్వానం’
Nikeelu Gunda | సూపర్ ఏఐ అకాడమీ ఫౌండర్ నికీలు గుండాకు ప్రతిష్ఠాత్మక పురస్కారం
100 Feets Master Plan Road | మేం కష్టపడి కట్టుకున్న స్కూల్ పోతుంది.. 100 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు రీఅలైన్మెంట్పై బాధిత మహిళ
NBK 112 | మ్యూజిక్ డైరెక్టర్‌పై క్లారిటీ.. అనిరుధ్, జీవీ ప్రకాష్‌లకు నో ఛాన్స్, బాలయ్య సినిమా అప్డేట్ ఇదే!
TN CM Vijay | జైలు నుంచి ఖైదీల పరారీ ఘటన.. తమిళనాడు సీఎం విజయ్ కీలక ఆదేశాలు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

