T20 Rankings : అంతర్జాతీయ పురుషుల టీ20ల్లో ఇంగ్లండ్ (England) జోరు కొనసాగుతోంది. స్వదేశంలో భారత్‌ను వైట్‌వాష్ చేసిన ఇంగ్లండ్.. ఇప్పుడు శ్రీలంక(Srilanka)ను క్లీన్‌స్వీప్ చేసి ఐసీసీ నంబర్ 1 ర్యాంక్ పట్టేసింది. రెండు రోజుల క్రితం రెండో స్థానంలో ఉన్న హ్యారీబ్రూక్ సేన మూడో టీ20లో అద్భుత విజయంతో టీమిండియాను వెనక్కి నెట్టింది. 1,1021 పాయింట్లు, 269 రేటింగ్స్‌తో అగ్రస్థానానికి ఎగబాకింది ఇంగ్లండ్.
స్వదేశంలో పంజా విసురుతున్న ఇంగ్లండ్ పురుషుల టీ20 టీమ్ ర్యాంకింగ్స్‌లో దుమ్మురేపింది. ఈమధ్యే సొంతగడ్డపై ఐదు టీ20ల సిరీస్‌లో భారత జట్టును వైట్‌వాష్ చేసిన హ్యారీ బ్రూక్ సేన.. ఈసారి శ్రీలంక పని పట్టింది. మూడు టీ20ల సిరీస్‌లో లంకను చిత్తు చిత్తుగా ఓడించిన ఇంగ్లండ్ నంబర్ 1 ర్యాంకు కైవసం చేసుకుంది.
2 days ago: “We want to get back to No.1”
Harry Brook wanted to take the top spot back from India, and then they did 👊 pic.twitter.com/GjX0ZIkEt6
— Cricinfo (@cricinfo) September 19, 2026
శనివారం జరిగిన మూడో టీ20లో 8 వికెట్ల తేడాతో గెలుపొంది సిరీస్‌ను 3-0తో దక్కించుకున్న ఇంగ్లండ్.. భారత్‌ను రెండో స్థానానికి నెట్టేసింది. ప్రస్తుతం 269 రేటింగ్స్‌తో టీ20 ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ అగ్రస్థానంలో నిలవగా.. భారత్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా జట్లు వరసగా రెండు, మూడు, నాలుగు, ఐదో ర్యాంకులో కొనసాగుతున్నాయి.