ధికరణ కేసులో హైకోర్టుకు హైడ్రా రంగనాథ్
కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేట్ భూమిని స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో దాఖలైన కోర్టు ధికరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్ అమరలింగం సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు.
హైదరాబాద్ , నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ప్రైవేట్ భూమిని స్వాధీనం చేసుకున్న వ్యవహారంలో దాఖలైన కోర్టు ధికరణ కేసులో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, శంషాబాద్ తహసీల్దార్ అమరలింగం సోమవారం హైకోర్టుకు హాజరయ్యారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామంలోని ప్రైవేట్ భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలంటూ యజమాని మొయినుద్దీన్ కోర్టు ధికరణ పిటిషన్ దాఖలు చేశారు.
తహసీల్దార్ అమరలింగం రాసిన లేఖ ఆధారంగా హైడ్రా అధికారులు భూమిని స్వాధీనం చేసుకున్నారని న్యాయవాది గత విచారణలో కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సోమవారం జరిగిన విచారణలో ఇద్దరు అధికారులు వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హైడ్రా తరఫు న్యాయవాది వాదిస్తూ.. కోర్టు ధికరణ పిటిషన్లో కౌంటర్లు దాఖలు చేసినట్టు తెలిపారు. దీంతో న్యాయమూర్తి రెండు వారాల గడువు మంజూరు చేస్తూ విచారణను వాయిదా వేశారు. రంగనాథ్,అమరలింగంకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

