రజత్ వీరవిహారం.. 48 బంతుల్లోనే అజేయంగా 135 రన్స్
ఐపీఎల్‌కు ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారథి రజత్ పటీదార్ మెరుపులు మెరిపిస్తున్నాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో మధ్యప్రదేశ్ జట్టును నడిపిస్తున్న అతడు..
- అసోంపై భారీ విజయం
- ముంబైని గెలిపించిన సూర్య
న్యూ చండీగఢ్ : ఐపీఎల్‌కు ముందే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) సారథి రజత్ పటీదార్ మెరుపులు మెరిపిస్తున్నాడు. సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్)లో మధ్యప్రదేశ్ జట్టును నడిపిస్తున్న అతడు.. సోమవారం అసోంతో జరిగిన ఎలైట్ గ్రూప్-సీ పోరులో 48 బంతుల్లోనే 8 బౌండరీలు, ఏకంగా 13 సిక్సర్ల సాయంతో అజేయంగా 135 రన్స్ చేసి ఆ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. రజత్ మెరుపులకు తోడు వన్‌డౌన్ బ్యాటర్ శివాంగ్ కుమార్ (38 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61) దూకుడుతో మొదట బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 250 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం ఛేదనలో అసోం 17.4 ఓవర్లలో 119 రన్స్‌కే ఆలౌట్ అవడంతో మధ్యప్రదేశ్ 131 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో ఆ జట్టుకు ఇది వరుసగా రెండో విజయం. కాగా ఈ మ్యాచ్‌లో శతక మెరుపులు మెరిపించిన రజత్.. పలు రికార్డులను బ్రేక్ చేశాడు. 25 బంతుల్లో అర్ధ శతకం, 41 బాల్స్‌లోనే సెంచరీ చేసిన రజత్.. టీ20ల్లో ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ ఆటగాడు డీటీ క్రిస్టియన్ (129) పేరిట ఉండేది. అదీగాక మధ్యప్రదేశ్ నుంచి స్మాట్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాటర్‌గా రజత్ చరిత్ర సృష్టించాడు. 8వ ఓవర్లో ఆ జట్టు స్కోరు 57/3తో ఉండగా క్రీజులోకి వచ్చిన అతడు శివాంగ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 62 బంతుల్లోనే 153 రన్స్ జోడించడం గమనార్హం.
సూర్య జోరు
గత కొన్నాళ్లుగా ఫామ్‌లేమితో జాతీయ జట్టుకు దూరమై కెరీర్ ప్రశ్నార్థకంగా మారిన వేళ ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 82) సత్తాచాటాడు. మునపటి సూర్యను గుర్తుచేస్తూ వీరబాదుడు బాదడంతో గుజరాత్‌పై ముంబై 5 వికెట్ల తేడాతో గెలిచింది. సూర్యతో పాటు సర్ఫరాజ్ ఖాన్ (40 నాటౌట్) రాణించడంతో గుజరాత్ నిర్దేశించిన 198 పరుగుల లక్ష్యాన్ని ముంబై 15.4 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
స్మాట్‌లో హైదరాబాద్ బోణీ
కోల్‌కతా : స్మాట్‌లో హైదరాబాద్ బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు.. ఉత్కంఠగా జరిగిన పోరులో ఒక్క వికెట్ తేడాతో ఛత్తీస్‌గఢ్‌ను ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఛత్తీస్‌గఢ్ 19.2 ఓవర్లలో 168 రన్స్‌కు పరిమితమైంది. ఆదిత్య సింగ్ (29 బంతుల్లో 47) టాప్ స్కోరర్. హైదరాబాద్ బౌలర్లలో అజయ్ దేవ్ గౌడ్ (4/28) నాలుగు వికెట్లతో చెలరేగగా కెప్టెన్ చామ మిలింద్ (3/20) మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ప్రత్యర్థి మాదిరిగానే మిలింద్ సేన తడబడినా హిమతేజ (37), అభిరథ్ (34)తో పాటు ఆఖర్లో తనయ్ త్యాగరాజన్ (19) రాణించడంతో ఆ జట్టు విజయాన్నందుకుంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

