కడుపు మండి.. శాపనార్థాలు పెట్టి
కాలువల్లో నీళ్లు రాక.. బోర్లలో నీళ్లున్నా కరెంటు లేక ఎండిన పంట పొలాన్ని చూసి రైతు గుండె తరుక్కుపోయింది. పంట పొలంలోనే కన్నీళ్లు కారుస్తూ భోరున విలపించాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శాపనార్థాలు పెట్టాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి డీబీఎం-38 కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో సుమారు 40 ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
- నీళ్లు లేక ఎండిన పొలాన్ని చూస్తూ రైతు కన్నీళ్లు
- దుఃఖంతో రేవంత్‌రెడ్డికి శాపనార్థాలు
- సోషల్ మీడియాలో వీడియో వైరల్
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : కాలువల్లో నీళ్లు రాక.. బోర్లలో నీళ్లున్నా కరెంటు లేక ఎండిన పంట పొలాన్ని చూసి రైతు గుండె తరుక్కుపోయింది. పంట పొలంలోనే కన్నీళ్లు కారుస్తూ భోరున విలపించాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి శాపనార్థాలు పెట్టాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గోరికొత్తపల్లికి డీబీఎం-38 కాలువ ద్వారా నీళ్లు రాకపోవడంతో సుమారు 40 ఎకరాల్లో పంట పొలాలు ఎండిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు.
గోరికొత్తపల్లికి చెందిన రైతు వెంకన్న ఎండిపోయిన పొలంలో నిలబడి, పొలా న్ని చూపిస్తూ కన్నీరు కారుస్తూ సీఎం రేవంత్‌రెడ్డికి శాపనార్థాలు పెడుతున్న వీడియో వైరల్‌గా మారింది. ‘రేవంత్ .. నిన్ను నమ్మితే.. అన్యాయం చేశావు కదయ్యా.. కాలువల ద్వారా నీళ్లు రాక, బోర్లలో నీళ్లున్నా కరెంట్ లేక పొలం ఎం డింది. నా పొలం ఎండిపోయిందయ్యా. నేను ఎట్లా బతుకాలయ్యా? రేవంత్.. నీ మాటలు నమ్ముకొని ఓటేస్తే.. నాకు అన్యాయం చేస్తివి? నిన్ను నమ్ముకుని 3 ఎకరాల్లో పొలం వేసిన.
ఇప్పుడు నీళ్లు లేక 3 ఎకరాలు ఎండిపోయిందయ్యా. నిన్ను నమ్ముకొని పొలమేస్తే నీళ్లులేక నా భూతల్లి నెర్రెలు వారిందయ్యా. నేను ఇక చావా లా? బతుకాలా? నేనేమి చేయాలయ్యా రేవంత్? రైతులను అన్యాలంగా ముంచితివికదయ్యా. నేను నీకు ఏం పాపం చేత్తినయ్యా. అప్పుజేసి పెట్టుబడి పెట్టిన. తీరా చూస్తే నువ్వు నీళ్లివ్వకపోతివి. నేనేం చెయ్యాలయ్యా? నేను చేసిన అప్పు ఎలా తీర్చాలయ్యా? నీళ్ల్లియ్యక 3 ఎకరాల పంటను నాశనం చేత్తివి. ఇక నాకు చావే దిక్కు. రైతులను ఏడిపిస్తే పుట్టగతులుండవయ్యా’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

