జై షా రెండోసారి.. ఐసీసీ చైర్మన్‌గా పునర్నియామకం
ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా జై షా వరుసగా రెండోసారి నియమితులయ్యారు. బాలిలో జరుగుతున్న బోర్డు సమావేశాల సందర్భంగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఐసీసీ తెలిపింది. 2024 డిసెంబర్లో తొలిసారి ఈ బాధ్యతలు చేపట్టిన షా..
బాలి : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) చైర్మన్‌గా జై షా వరుసగా రెండోసారి నియమితులయ్యారు. బాలిలో జరుగుతున్న బోర్డు సమావేశాల సందర్భంగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఐసీసీ తెలిపింది. 2024 డిసెంబర్లో తొలిసారి ఈ బాధ్యతలు చేపట్టిన షా.. మరో రెండేండ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా షా స్పందిస్తూ.. ‘ఐసీసీ బోర్డు సభ్యులు నాపై ఉంచిన నమ్మకానికి ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
ఐసీసీ చైర్మన్‌గా పనిచేయడం గొప్ప గౌరవం, బాధ్యత. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రయోజనాలను ముందుకు తీసుకెళ్లడానికి మా సభ్యులతో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నా. శతాబ్దాల తర్వాత ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనం చేయబోతున్న ఈ తరుణంలో ప్రేక్షకులకు ఈ ఆటను ఘనంగా పరిచయం చేద్దాం’ అంటూ ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్‌లో రాసుకొచ్చారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

