తిరగని చక్రం.. పెరిగిన వడ్డీ
తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు డ్రైవర్ల సమస్యలపై తొలుత పోరాటం చేసి.. అదే డ్రైవర్లను బలిచేసే ఫైనాన్స్ సంస్థలకు విశ్వాసంగా పనిచేస్తున్న కొన్ని ఆటో సంఘాల వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి.
- ఆటోలన్నీ ఫైనాన్సర్ల చేతుల్లోనే!
- ఫైనాన్స్ సంస్థలకు మధ్యవర్తులుగా కొన్ని ఆటో యూనియన్లు
- డ్రైవర్లను వేధిస్తున్న ఫైనాన్సర్లకే సలాం కొడుతున్న దుస్థితి
- ఇటీవల ప్రభుత్వం 20 వేల కొత్త ఆటోలకు పర్మిషన్
- అత్యధిక ధరలకు విక్రయించిన డీలర్లు
- అవకతవకలు జరగడంతో నిలిచిన విక్రయ ప్రక్రియ
- ప్రస్తుతం ఆగిపోయిన 2500 ఆటోల అమ్మకాలపై గురి
- అనుమతులు తెచ్చుకునేలా కొన్ని ఆటో సంఘాలతో వ్యూహం
సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : తొండ ముదిరితే ఊసరవెల్లి అయినట్టు డ్రైవర్ల సమస్యలపై తొలుత పోరాటం చేసి.. అదే డ్రైవర్లను బలిచేసే ఫైనాన్స్ సంస్థలకు విశ్వాసంగా పనిచేస్తున్న కొన్ని ఆటో సంఘాల వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఫైనాన్స్ సంస్థలకు కొన్ని ఆటో యూనియన్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటికే ఆటో ఫైనాన్స్ సంస్థల ఆగడాలు మితిమీరిపోతున్నా చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. నగరంలో ఆటో విక్రయాల్లో కొన్ని ఫైనాన్స్ నిర్వాహకులు అత్యధిక వడ్డీలతో రుణాలు అందించి నిబంధనలకు విరుద్ధంగా దందా చేస్తున్నారు. ఆ కిస్తీలు చెల్లించలేక ఇబ్బందుల్లో ఉన్న డ్రైవర్లను బెదిరించి ఆటోలను వెనక్కి తీసుకుంటున్నారు. మళ్లీ అదే ఆటోలను కొత్తవారికి విక్రయించి డబ్బులు దండుకుంటున్నారు. నగరంలో ఆటోలు 1.40 లక్షలకు పైగా ఉంటే అందులో సుమా రు 70 శాతం ఆటోలు ఓ రెండు ఫైనాన్స్ కంపెనీల చేతుల్లోనే ఉండటం గమనార్హం. ఆటో ఫైనాన్స్‌లో రాటుదేలిన ఆ సంస్థలు ఎటువంటి నిబంధనలనైనా తుడిచేసి వారికి నచ్చినట్టు రాసేసుకుంటున్నాయి. అందుకోసం కొన్ని ఆటోపేజీలో
యూనియన్ నాయకులకు ఆమ్యామ్యాల ఆశచూపి వారితో ఆర్టీఏ అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఫైనాన్షియర్ల సమస్యను ఆటో డ్రైవర్ల సమస్యగా మార్చి ఆ యూనియన్ సంఘాలు ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఫైనాన్స్ సంస్థలకు అండగా నిలుస్తున్నారు.
ఫైనాన్స్ కంపెనీల మాట.. ఆటో డ్రైవర్ల నోట!
ప్రభుత్వం ఇటీవల ఓఆర్ఆర్ పరిధిలో 20వేల కొత్త ఆటోలకు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. అందులో అత్యధిక వడ్డీలతో ఆటోలను డీలర్లు విక్రయించారు. మరోవైపు సుమారు 3 లక్షలు ఉన్న ఆటోను వడ్డీలు, డౌన్ పేమెంట్ అంటూ రూ.5లక్షలకు ఆటోలను ఫైనాన్స్ చేశారు. ఈ వ్యవహారంపై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో అప్పటి కలెక్టర్ హరిచందన విచారణకు ఆదేశించారు. దీంతో 2500 ఆటో విక్రయ ప్రక్రియ నిలిచిపోయింది. అయితే మళ్లీ ఆ ఆటోల విక్రయానికి అనుమతులు ఇవ్వాలంటూ..
నగరంలో పెద్ద ఎత్తున దందా చేస్తున్న రెండు ఫైనాన్స్ సంస్థలు వ్యూహం వేశాయి. ఇందులో తమకు వత్తాసు పలికే కొందరి ఆటో నాయకులతో ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొట్టిస్తున్నారు. ఆ కొత్త ఆటోలకు అనుమతివ్వాలంటూ పలు దరఖాస్తులను అధికారులకు అందిస్తున్న ప్రక్రియలో వారు ఫైనాన్స్ సంస్థల కీలుబొమ్మలుగా మారిపోవడం గమనార్హం. ఆటో విక్రయాల్లో డీలర్లకు, అధికారులకు స్పష్టమైన నిబంధనలు ఉన్నా.. అవి క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా ఆటో దందా చేస్తూ అమాయక ఆటో డ్రైవర్లను అప్పుల ఊబిలో దింపుతున్నారు. కాగా, కొత్తగా ఆటోల విక్రయానికి అనుమతిచ్చే ముందు ఇప్పటి వరకు జరిగిన ఆటో కొనుగోలు, విక్రయాలపై విచారణ జరిపి ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని కొందరు ఆటో డ్రైవర్లు ప్రస్తుత హైదరాబాద్ కలెక్టర్‌కు వినతి పత్రాలు అందించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించినట్టు ఆటో డ్రైవర్లు తెలిపారు.
పట్టించుకునేవారేరీ?
గ్రేటర్ హైదరాబాద్‌లో సుమారు 700కు పైగా ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఉన్నాయి. ఇందులో అత్యధికం ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఫైనాన్స్ సంస్థలు అందరూ సిండికేట్‌గా మారి మూడు పువ్వులు ఆరు కాయలుగా వ్యాపారం సాగిస్తున్నారు. ఫలితంగా ఆటో డ్రైవర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. నగరంలో ఆటోలపై ఆధారపడి రెండు నుంచి మూడు లక్షల కుటుంబాలు జీవిస్తున్నాయి. ప్రస్తుతం ఇటు కిరాయి డబ్బులు రాక ఆటు గిరాకీ లేక చాలా మంది ఆటో డ్రైవర్లు రోడ్డునపడుతున్నారు. కొందరు అప్పుల పాలై కుటుంబాన్ని పోషించలేకపోతున్నామని ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు. ప్రభుత్వం రుణాలు మంజూరు చేయకపోవడం వల్ల కార్మికులు ప్రైవేట్ ఫైనాన్స్‌లను ఆశ్రయిస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన సంస్థలు అధిక వడ్డీలకు ఆటోలను విక్రయిస్తూ దోపిడీ చేస్తున్నాయి. ఉదాహరణకు ఒక్క ఆటో ఖరీదు రూ.2.40 లక్షలు ఉండగా..
ముందుగానే రూ.50-60వేలు కట్టించుకుని మిగిలిన మొత్తానికి రూ.2.50 నుంచి 3 రూపాయలపైనే వడ్డీని కలిపి సుమా రు 5 లక్షల వరకు మొత్తాన్ని కిస్తీల రూపంలో వసూలు చేస్తున్నారు. ఏదైనా ఇబ్బంది వచ్చి కిస్తీలు చెల్లించని పక్షంలో ఆటోను జప్తు చేసుకుని, వారి వ్యక్తులకు కిరాయికి ఇచ్చి డబ్బులు దండుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ 2500 ఆటోల విక్రయానికి అనుమతిస్తే మరోసారి ఆటో దందాకు తెరలేపే ప్రమాదం ఉందని, అధికారులు కఠిన నిబంధనలు తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

