ఎముకలకు పొగ దెబ్బ
సాధారణంగా ఎముకలు చిన్నప్పటి నుంచి బలపడతాయి. 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయసులో ఎముకలు అత్యంత దృఢంగా మారుతాయి. 30 ఏండ్లు దాటినప్పటి నుంచి ఎముకల సాంద్రత పెరుగుదల ఆగిపోతుంది. అలాగే తగ్గుదల మొదలవుతుంది. ఇలా కాలక్రమేణా బలహీనపడే ఎముకలు కొందరిలో తొందరగా బలహీనపడతాయి. క్యాల్షియం ఉన్న ఆహారం తగినంత తినకపోతే సాధారణంగా ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి వస్తుంది.
సాధారణంగా ఎముకలు చిన్నప్పటి నుంచి బలపడతాయి. 20 నుంచి 30 ఏండ్ల మధ్య వయసులో ఎముకలు అత్యంత దృఢంగా మారుతాయి. 30 ఏండ్లు దాటినప్పటి నుంచి ఎముకల సాంద్రత పెరుగుదల ఆగిపోతుంది. అలాగే తగ్గుదల మొదలవుతుంది. ఇలా కాలక్రమేణా బలహీనపడే ఎముకలు కొందరిలో తొందరగా బలహీనపడతాయి. క్యాల్షియం ఉన్న ఆహారం తగినంత తినకపోతే సాధారణంగా ఎముకల సాంద్రత తగ్గుతుంది. ఆస్టియోపొరోసిస్ అనే వ్యాధి వస్తుంది. కొందరు క్యాల్షియం ఉన్న ఆహారం తిన్నా జీర్ణకోశ వ్యాధులు, ఎక్కువ కాలం బెడ్ రెస్ట్, మెనోపాజ్, విటమిన్ డి లోపం వల్ల కూడా క్యాల్షియం లోపాన్ని ఎదుర్కొంటారు. శరీరంలో క్యాల్షియం లోపానికి పరోక్షంగా కారణమయ్యే వ్యాధులు వచ్చినప్పుడు వైద్యులు ముందే హెచ్చరిస్తారు.
కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ఇలాంటి సమస్యలు లేకున్నా కొంతమందిలో ఎముకలు తొందరగా బలహీనపడిపోతుంటాయి. రోజూ క్యాల్షియం ఉండే ఆహార పదార్థాలు బాగానే తింటున్నాం కాబట్టి, ఎముకలు బలంగా ఉన్నాయనుకుంటే పొరపాటే! పొగ తాగడం వల్ల శరీరం.. క్యాల్షియం సంగ్రహణ శక్తిని కోల్పోతుంది. ధూమపానం వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి. గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది. కిడ్నీల పనితీరుపైనా ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఇవే జనానికి ఎక్కువగా తెలుసు. కానీ, పొగతాగే అలవాటు ఎముకలపైనా ప్రభావం చూపిస్తుంది. ఎన్ని ఆహార నియమాలు పాటించినప్పటికీ, ఎముకల్ని కాపాడుకోవాలంటే.. పొగ మానేయాల్సిందేనని చెబుతున్నారు వైద్యులు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా
Watch: వేగంగా వస్తున్న కారు నుంచి తప్పించుకునేందుకు మహిళ యత్నం.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video

