Israeli F-35: యాక్-130 ఫైటర్ జెట్‌ను కూల్చిన ఎఫ్-35: ఐడీఎఫ్
Israeli F-35: టెహ్రాన్ గగనవీధిలో ఇరాన్ జెట్‌ను ఇజ్రాయల్ వైమానిక దళం కూల్చివేసింది. ఎఫ్-35 యుద్ధ విమానంతో యాక్-130 జెట్‌ను కూల్చివేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. 40 ఏళ్ల తర్వాత యుద్ధంలో ఓ మానవసహిత విమానాన్ని కూల్చినట్లు ఇజ్రాయెల్ చెప్పింది.
టెల్ అవివ్: భీకర రీతిలో ఇజ్రాయెల్ ఇవాళ మళ్లీ వైమానిక దాడులకు పాల్పడింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. అయితే ఇజ్రాయెల్ వైమానిక దళానికి చెందిన ఎఫ్-35ఐ యుద్ధ విమానం(Israeli F-35).. ఇవాళ టెహ్రాన్ గగనతలంలో యాక్-130 జెట్‌ను కూల్చివేసింది. కొన్ని క్షణాల క్రితం రష్యా తయారీకి చెందిన యాక్-130 జెట్‌ను కూల్చినట్లు ఐడీఎఫ్ వర్గాలు వెల్లడించాయి. ఐడీఎఫ్ తన ఎక్స్ అకౌంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది.
ఎఫ్-35 యుద్ధ విమానం.. రణరంగంలో ఓ మానవసహిత విమానాన్ని కూల్చడం ఇదే మొదటిసారి. అయితే గడిచిన 40 ఏళ్లలో తొలిసారి ఇజ్రాయెల్ వైమానిక దళాలు మానవసహిత ఎయిర్-టు ఎయిర్- కంబాట్‌లో పాల్గొన్నాయి. 1985 నవంబర్ 24వ తేదీన చివరిసారి ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్ గగనతలంలో శత్రు విమానాన్ని కూల్చివేసింది. ఆ సమయంలో సిరియాకు చెందిన మిగ్-23 ఫైటర్ విమానాలను ఐఏఎఫ్ ఎఫ్-15 నేలకూల్చింది.
🛩️IRANIAN JET SHOT DOWN: An IAF F-35I “Adir” fighter jet shot down an Iranian Air Force YAK-130 fighter jet.
This is the first shootdown in history of a manned fighter aircraft by an F-35 “Adir” fighter jet.
— Israel Defense Forces (@IDF) March 4, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

