Bollam Mallaiah Yadav | ఇండ్ల లబ్ధిదారుల ఎంపికలో తప్పుడు విధానాలకు పాల్పడితే సహించం : మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
Bollam Mallaiah Yadav | వ్యక్తిగత కక్షలు, రాజకీయ కారణాలతో మిగిలిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెల్లడించారు.
సూర్యపేట : వ్యక్తిగత కక్షలు రాజకీయ కారణాలతో మిగిలిన డబుల్ బెడ్ రూం( Double Bed room ) ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియల్లో తప్పుడు విధానాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోబోమని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ( Bollam Mallaiah Yadav ) వెల్లడించారు. ఆదివారం కోదాడలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
మూడు సంవత్సరాల అనంతరం బాలాజీ నగర్ ( Balajinagar ) లోని 560 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాను 548 లబ్ధిదారులకు అధికారులు పట్టాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఇక మిగిలిన లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేయాలని అధికారులకు సూచించారు. నిరుపేద కుటుంబాలకు సొంతింటి కల నెరవేరాలని ఆకాంక్షతో తాను శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలో పారదర్శకంగా కలెక్టర్ పర్యవేక్షణలో లబ్ధిదారులు ఎంపిక పూర్తి చేశానని తెలిపారు.
అయితే అధికారుల నిర్లక్ష్యంతో పలు సాంకేతిక కారణాల దృష్ట్యా పట్టాలు పంపిణీ చేయలేకపోయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తాము తక్షణమే మౌలిక వసతులు పూర్తిచేసి ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని పలుమార్లు ఆందోళన చేశామన్నారు. అండర్ డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా నడుస్తుందని నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదని విమర్శించారు. మీడియా సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎస్ కే నయీమ్, కౌన్సిలర్ చీమ నరేష్, ఉపేందర్ గౌడ్, అలవాల వెంకట్, ఉపేందర్, కరీముల్లా పాల్గొన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

