Akkineni Family | అక్కినేని కుటుంబం తాజాగా ఒకే వేదికపైకి చేరి సందడి చేసింది. లెజెండరీ నటుడు, అక్కినేని నాగేశ్వరరావు (ANR) జయంతి సందర్భంగా కుటుంబ సభ్యులంతా ఒక్కచోట కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు సంబంధించిన ఫొటోను అక్కినేని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ప్రస్తుతం ఈ ఫొటో విపరీతంగా వైరల్ అవుతుంది.
సినీ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు ఉన్న అక్కినేని కుటుంబం, ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇలాంటి ప్రత్యేక సందర్భాలలో మాత్రం అందరూ కలిసి వేడుకలను జరుపుకోవడం ఎప్పుడూ విశేషమే. ఈ సమావేశంలో అక్కినేని నాగార్జునతో పాటు కుటుంబంలోని ఇతర ప్రముఖ సభ్యులు కూడా పాల్గొని, ఏఎన్ఆర్ జ్ఞాపకాలను నెమరువేసుకున్నట్లు తెలుస్తోంది. దిగ్గజ నటుడి జయంతిని పురస్కరించుకుని కుటుంబ సభ్యులందరూ కలిసి ఆత్మీయంగా గడపడం, ఆయనకు ఘన నివాళులు అర్పించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
— Akhil Akkineni (@AkhilAkkineni8) September 20, 2026