Raaka | అట్లీ బర్త్ డే సందర్భంగా ‘రాకా’ గ్లింప్స్.. హాలీవుడ్ స్టార్ ఇందులో మెరుస్తాడా?
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. అల్లు అర్జున్‌కి ‘పుష్ప’, ‘పుష్ప 2’తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ రావడం, అట్లీ ‘జవాన్’తో హిందీ ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Raaka | ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘రాకా’. అల్లు అర్జున్‌కి ‘పుష్ప’, ‘పుష్ప 2’తో దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ రావడం, అట్లీ ‘జవాన్’తో హిందీ ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడంతో ఈ ఇద్దరి కలయికలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ‘రాకా’కు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ సోషల్ మీడియాలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెప్టెంబర్ 21న దర్శకుడు అట్లీ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో సోమవారం రానున్న ఈ గ్లింప్స్‌పై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.మరోవైపు అట్లీ దగ్గర పనిచేసిన దర్శకుడు సిబి చక్రవర్తి ‘రాకా’ విజువల్స్‌పై చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
‘అవతార్’ చిత్రాల్లో కనిపించే విజువల్స్‌ను మించే స్థాయిలో ఈ సినిమాలో విజువల్ గ్రాండియర్ ఉంటుందని ఆయన చెప్పినట్లు ప్రచారం జరిగింది. దీంతో గ్లింప్స్‌లో ఎలాంటి విజువల్స్ చూపించబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.‘రాకా’లో హాలీవుడ్ నటీనటులు కూడా భాగం కానున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. ఈ క్రమంలో హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ పేరు కూడా తెరపైకి వచ్చింది. సినిమాలో ఆయన కీలక పాత్రలో కనిపించబోతున్నారనే ప్రచారం జరిగింది. అంతేకాదు, అట్లీ పుట్టినరోజు సందర్భంగా విడుదల కానున్న గ్లింప్స్‌లో విల్ స్మిత్‌ను చూపించబోతున్నారనే వార్తలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. గ్లింప్స్‌లో విల్ స్మిత్ కనిపించరని తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం, ఈ గ్లింప్స్‌లో ప్రధానంగా ‘రాకా’ ప్రపంచాన్ని, సినిమాలోని విజువల్ గ్రాండియర్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసే విధంగా రూపొందించారట. హాలీవుడ్ నటుడి పాత్రకు సంబంధించిన వివరాలను గ్లింప్స్‌లో వెల్లడించకపోవచ్చని తెలుస్తోంది. ఇక ‘రాకా’లో అల్లు అర్జున్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోనే కథానాయికగా నటిస్తుంది.. బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. సినిమాకు యువ సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్ సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. కథ, విజువల్స్, భారీ తారాగణం, అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ‘రాకా’ను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Allu arjun
- atlee
- first look
- glimpse
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

