Harish Rao | ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం
Harish Rao | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు.
Harish Rao | రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని తెలంగాణ రాష్ట్రానికి చేస్తున్న జలద్రోహానికి కేఆర్ఎంబీ సమావేశం మినిట్సే మరో సాక్ష్యమని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు విమర్శించారు. హైదరాబాద్ కేంద్రంగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో ఏపీ ప్రతిపాదించిన అక్రమ పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై రేవంత్ ప్రభుత్వం కనీసం ప్రస్తావించకపోవడం ఏపీకి వరంగా మారితే.. తెలంగాణకు శాపంగా పరిణమిస్తోందని మండిపడ్డారు.
చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతున్న రేవంత్ రెడ్డి.. తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టి ఏపీ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తున్నాడు అనడానికి ఇంతకంటే నిదర్శనం ఉండదని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ రెడ్డి…నాగార్జునసాగర్ జలాలను తరలించేందుకు ఏపీ నిర్మిస్తున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు గురించి ఎందుకు ప్రశ్నించలేదు? ఏపీ అక్రమ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఎందుకు గళమెత్తలేదు? తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
నాడు ఢిల్లీ వేదికగా జరిగిన సమావేశంలో గోదావరి జలాలను తరలించే బనకచర్ల ప్రాజెక్టుపై నిలదీయకుండా జలద్రోహం చేశారని.. నేడు హైదరాబాద్ వేదికగా జరిగిన కేఆర్ఎంబీ సమావేశంలో కృష్ణా జలాలను తరలించే పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రశ్నించకుండా మరోసారి జలద్రోహానికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నాడు బనకచర్ల.. నేడు పల్నాడు! ప్రాజెక్టులు మారుతున్నాయి.. వేదికలు మారుతున్నాయి.. కానీ తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే రేవంత్ రెడ్డి వైఖరి మాత్రం మారడం లేదని విమర్శించారు. తెలంగాణ నీటి హక్కులను కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి లొంగిపోయి, ఆ రాష్ట్ర ప్రయోజనాలకు సహకరిస్తుంటే తెలంగాణ ప్రయోజనాలకు రక్షణ ఎవరు? మేధావులు, తెలంగాణవాదులు ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు.
కేఆర్ఎంబీ సమావేశంలో పల్నాడు ప్రాజెక్టు ప్రస్తావనే రాలేదని ఏపీ ఇంజనీర్లే చెబుతుంటే.. సమావేశంలో పల్నాడు ప్రాజెక్టుపై చర్చించామని గొప్పగా ప్రచారం చేసుకున్న వారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. నాడైనా నేడైనా నీళ్ల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది, చేస్తున్నది కాంగ్రెసే అని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి.. నీ అసలు రంగు బయటపడింది. నీ నిజస్వరూపం బట్టబయలైంది. తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెట్టి నువ్వు చేస్తున్నది చారిత్రక ద్రోహం. ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎన్నటికీ క్షమించదని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఈ ద్రోహాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదు.. రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు ఆగ్రహం
Meenakshi Chaudhary | చీరకట్టులోనూ గ్లామర్ డోస్ పెంచిన మీనాక్షి.. అదిరిపోయే ఫొటోలు!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
KTR | రోడ్డు ప్రమాద బాధితుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా
Exercise | వ్యాయామం చేయకముందు, చేసిన తరువాత ఎలాంటి ఆహారాలను తీసుకోవాలి..?
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

