Jailer 2 | ‘జైలర్ 2’లో బాలీవుడ్ బ్యూటీ విద్యాబాలన్.. ‘కాంత’గా మాస్ ఎంట్రీ!
Vidya Balan | సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ 'జైలర్ 2' నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
Vidya Balan | సూపర్‌స్టార్ రజనీకాంత్, టాలెంటెడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘జైలర్ 2’ నుంచి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా, తాజాగా విడుదలైన ఒక క్యారెక్టర్ గ్లింప్స్ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రంలో ప్రముఖ నటి విద్యాబాలన్ అత్యంత శక్తిమంతమైన ‘కాంత’ అనే పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విడుదలైన ఆమె ఫస్ట్ లుక్ టీజర్లో విద్యాబాలన్ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా స్టైలిష్‌గా ఉంది. నీలిరంగు చీర, నలుపు రంగు జాకెట్లో మెట్లపై నుంచి ఆమె నడుచుకుంటూ వచ్చిన తీరు, గంభీరమైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
చివర్లో ఆమె చెప్పిన పదునైన డైలాగ్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఈ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. కేవలం గ్లామర్ పాత్ర కాకుండా, కథను మలుపు తిప్పే ఒక పవర్ఫుల్ మరియు మాస్ పాత్రలో విద్యాబాలన్ కనిపించబోతున్నారు. రజనీకాంత్ యాక్షన్‌కు దీటుగా ఆమె నటన ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, మిథున్ చక్రవర్తి, సూరజ్ వెంజరమూడు తదితరులు నటిస్తుండగా, రమ్యకృష్ణన్, యోగి బాబు మొదటి భాగంలోని తమ పాత్రలనే కొనసాగిస్తున్నారు. భారీ తారాగణంతో రూపుదిద్దుకుంటున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 15న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | ఎల్‌నినో, కొవిడ్ లాంటి విపత్తుల కంటే ప్రమాదకరం కాంగ్రెస్ పాలన : హరీశ్ రావు
The Greatest Trailer | బాక్సింగ్ దిగ్గజం మొహమ్మద్ అలీ బయోపిక్.. ‘ది గ్రేటెస్ట్’ ట్రైలర్ విడుదల
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

