కాళేశ్వరా.. నీ గుడి పూర్తయ్యేదెన్నడు?
రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మాణం, అభివృద్ధి పేరుతో కూల్చేసింది. నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించి నా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలే దు. 2027లో జరిగే పుషరాల్లోపు నిర్మాణం పూర్తి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో విఫలమవుతున్నదని భక్తులు మండిపడుతున్నారు.
- పురాతన ఆలయం కూల్చివేత
- పునర్నిర్మాణానికి 198 కోట్లు
- 4 నెలలవుతున్నా ముందుకు సాగని నిర్మాణ పనులు
- పుషరాలు సమీపిస్తున్నా నిర్లక్ష్యమే
జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రసిద్ధ శైవ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయం పునర్నిర్మాణంపై కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. 11వ శతాబ్దంలో నిర్మించిన ఈ పుణ్యక్షేత్రాన్ని పునర్నిర్మాణం, అభివృద్ధి పేరుతో కూల్చేసింది. నాలుగు నెలల కిందట పనులు ప్రారంభించి నా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలే దు. 2027లో జరిగే పుషరాల్లోపు నిర్మాణం పూర్తి చేస్తామని ఆర్భాటంగా ప్రకటించినా ఆచరణలో విఫలమవుతున్నదని భక్తులు మండిపడుతున్నారు. గోదావరి, ప్రాణహిత నదులు, అంతర్వాహినిగా సరస్వతి నది కలిసే పవిత్ర దక్షిణ త్రివేణి సంగమం వద్ద కాళేశ్వర-ముక్తీశ్వర పుణ్యక్షేత్రం కొలువై ఉన్నది. ఒకే పానవట్టంపై ముక్తీశ్వరస్వామి, కాళేశ్వరస్వామి లిం గాలు ఉండటం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ముక్తీశ్వర స్వామి లింగానికి రెండు చిన్నరంధ్రాలు ఉండటం, వాటిలో నీరు పోసినా నిండకపోవడం విశేషం. భక్తులు దీన్ని దైవ మహిమగా భావిస్తారు. దక్షిణ త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు చేసి కాళేశ్వర-ముక్తీశ్వరస్వామిని దర్శించుకొంటే పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.
నత్తనడకన పనులు
కాళేశ్వర-ముక్తీశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణం, అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.198 కోట్లు కేటాయించింది. ఏప్రిల్ 20న సీఎం రేవంత్‌రెడ్డి ఈ పనులకు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికి ఆలయ నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు జూలై చివరివారంలో ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యా యి. పనులు ప్రారంభమై నాలుగు నెలలు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని భక్తులు విమర్శిస్తున్నారు. అష్టతీర్థఘాట్ల పనులతోపాటు ఆలయ పనులు సైతం నత్తనడకన నడుస్తుండటంతో తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. ప్రధాన గర్భగుడి ఉపపీఠం పనులు, ముందు ముఖ మండపం పనుల్లో పురోగతి లేదు. ఉత్తరం వైపు గోపురం స్టోన్వర్, పడమర వైపు గోపురం సివిల్ వర్క్స్, దక్షిణం వైపు జరుగుతున్న సివిల్ పనులు, పార్వతి, సరస్వతి, రామాలయం పనులు సైతం నత్తనడక సాగుతున్నాయి. రామాలయం పునాదిపై గ్రేడ్స్లాబ్ వర్స్ వంటి పనులు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపు ప్రాకారాల పనుల్లో ఏ మాత్రం పురోగతి లేదు. అష్టతీర్థాల ఘాట్ల నిర్మాణానికి భూ సేకరణ సమస్య అడ్డంకిగా మారగా, ఇప్పటివరకు పరిష్కరించలేదు.

ఏడు నెలల్లో పూర్తయ్యేనా?
పాత ఆలయాలను తొలగించడంతో ఆది ముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బాలాలయంలో ఉత్సవ మూర్తులను ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. 2027 జూన్ 26 నుంచి 12 రోజుల పాటు గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తున్న ది. ఆ లోగా నిర్మాణం పూర్తి చేసి, కాళేశ్వరం దేవస్థానంలో కుంభాభిషేకం నిర్వహించాల్సి ఉన్నది.ఏడు నెలల్లో పూర్తిచేయడం సాధ్యమే నా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
పుష్కరాల్లోపు ప్రధాన పనులు పూర్తి
ప్రస్తుతం విజయగణపతి, కాళేశ్వర-ముక్తీశ్వర ఆలయం, పార్వతి అమ్మవారు, సుబ్రహ్మణ్యస్వామి మండపం, సీతారామాలయం, మహా సరస్వతి ఆలయ పనులు కొనసాగుతున్నాయి. వీటిని పుషరాల్లోపు పూర్తి చేస్తం. భక్తులకు ఇబ్బందులు లేకుండా చూస్తం. తూర్పువైపు రాజగోపురం, నిర్మాణ ప్రాకారం పనులు మాత్రం ఆగుతయ్. వాటిని కూడా వీలైనంత త్వరలోనే పూర్తి చేస్తం.
– ఎస్ మహేశ్, ఆలయ కార్యనిర్వహణాధికారి
సౌకర్యాలు లేక ఇబ్బందులు
కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో భక్తులకు కష్టాలు తప్పడం లేదు. ఆలయ పునఃనిర్మాణ పనుల పేరుతో పురాతన ఆలయాన్ని కూల్చివేసి, ప్రస్తుతం బాలాలయంలోనే స్వామివారి దర్శన ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. 2027లో గోదావరి పుషరాలు సమీపిస్తున్న వేళ ఆలయ పునఃనిర్మాణ పనులు ఇంకా అసంపూర్తిగానే ఉన్నాయి. పుషరాల నాటికి పనులు పూర్తవుతాయా? పూర్తిస్థాయి దర్శన సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయా? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవమైన కాళేశ్వర ముక్తీశ్వర స్వామి క్షేత్రంలో కనీస సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఆలయ అధికారులపై ఉన్నది. పునఃనిర్మాణ పనులు పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి.
– సతీశ్, భక్తుడు, హనుమకొండ జిల్లా
బాలాలయం వద్ద సరైన ఏర్పాట్లు లేవు
కాళేశ్వర పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు సరిగ్గాలేవు. ఆలయాన్ని కూల్చివేసి బాలాలయంలో ఉత్సవమూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నారు. కానీ, బాలాలయం వద్ద అపరిశుభ్రంగా ఉన్నది. ముఖ్యంగా గోదావరి తీరంలో కూడా ఏర్పాట్లు సరిగ్గాలేవు. ఘాట్లు, ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక శోభ కనపడటం లేదు. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం కార్తీక మాసం కావడంతో క్షేత్రానికి భక్తుల రద్దీ పెరిగింది.
– నూనె సునీత, భక్తురాలు, జగిత్యాల జిల్లా
సౌకర్యాలు లేవు..
ముక్తీశ్వరస్వామి ఆలయం వద్ద ఏ ర్పాటు చేసిన బాలాలయంలో ఉత్సవ మూర్తులను ప్రతిష్ఠించి పూజలు చేస్తున్నరు. దర్శనానికి వచ్చిన భక్తులకు అక్కడ సరైన సౌకర్యాలు కల్పించలేదు. ఆలయం వద్ద అంతా అపరిశుభ్రంగా ఉన్నది. ఆల య పనులు చూస్తుంటే గోదావరి పుషరాల్లోపు పూర్తయ్యేలా కనిపించడం లేదు.
– కటకం జనార్దన్, జంగేడు,
జయశంకర్ భూపాలపల్లి
నాణ్యతలో లోపాలు ఉండొద్దు
గోదావరి పుషరాలు సమీపిస్తున్న నేపథ్యంలో పనులు వేగంగా చేయాలనే ఉద్దేశంతో నాణ్యత కు ప్రాధాన్యం ఇ వ్వడం లేదు. ఇది మంచి పద్ధతి కాదు. ప్రమాణాలు తప్పనిసరిగా పాటించి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్మాణాలు పటిష్టంగా చేపట్టాలి. సంబంధిత ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి. పర్యవేక్షణ పెంచాలి.
– కేదారి గీత, బీఆర్ఎస్ నాయకురాలు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

