వైఎస్‌లా నేనూ పదేండ్లు ఉంటా!
ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, తాను కూడా పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి అచ్చంపేట సభలో మళ్లీ అబద్ధాల వరద పారించారు.
- సీఎం రేవంత్‌రెడ్డి వింత వ్యాఖ్యలు
- బార్లు, కల్లు దుకాణాల్లో కాంగ్రెస్ పాలనపై చర్చ పెట్టాలంటూ పిలుపు
- అచ్చంపేట సభలో అబద్ధాలు వల్లెవేత
- సీఎం మాట్లాడుతుండగా వెళ్లిన జనం
- సర్కారీ ప్రోగ్రాంలో కాంగ్రెస్ ఫొటోలు
మహబూబ్‌నగర్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్నాడని, తాను కూడా పదేండ్లు సీఎంగా ఉంటానని రేవంత్‌రెడ్డి అచ్చంపేట సభలో మళ్లీ అబద్ధాల వరద పారించారు. ఎన్టీయార్, వైఎస్, కేసీఆర్‌లు పదేండ్లు పాలించారని, ఆ లెక్కన తాను 2034 వరకు అధికారంలో ఉంటానని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి 2004 నుంచి 2009 వరకు ఐదేండ్ల మూడునెలలు మాత్రమే పాలించారు. కానీ ఆయన పదేండ్లు పాలించారంటూ రేవంత్ మాట్లాడుతుంటే విస్తుపోవడం ప్రజలవంతైంది.
గురువారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నిర్వహించిన ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడారు. తమ హయాంలో రైతు ఆత్మహత్యలు తగ్గిపోయాయని, రైతు బీమా, రైతు భరోసా, సబ్సిడీ ఎరువులు, పంట రుణాలు.. 24 గంటల ఉచిత కరెంట్, సన్న వడ్లకు బోనస్ ఇవ్వడంతో రైతు ఆత్మహత్యలు తగ్గాయన్నారు. ధైర్యంగా పంటలు పండించే స్థాయికి రైతులు ఎదిగారని పేర్కొన్నారు. కోటిమంది ఆడబిడ్డలకు చీరలిస్తున్నందున, వారి ఓట్లు తమకే పడుతాయని.. చీర తీసుకుని మహిళలు 90 సీట్లల్లో తమను గెలిపిస్తారని అన్నారు.
ప్రజా పాలనపై గ్రామాల్లో రచ్చబండలు, కల్లు దుకాణాలు, బీర్ షాపుల వద్ద చర్చ పెట్టాలని మరోసారి సూచించారు. డిండికి అర టీఎంసీ నీళ్లు కేటాయిస్తామని నల్లగొండ నేతలకు హామీ ఇచ్చారు. ‘మా మీటింగుల దగ్గర పల్లీ, బఠాణీలు అమ్ముకునేంత మంది కూడా బీజేపీలో లేరు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సొంత రాష్ట్రంలోనే ఓడిపోయిండు. బీహారోళ్లే ఆయనను బండకేసి కొట్టిండ్రు. ఆయన ఇక్కడికొచ్చి నాకు చెప్తడట!’ అని రేవంత్ విరుచుకుపడ్డారు. బీజేపీతో ముఖ్యమంత్రి అంటకాగుతున్నాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
కూలిన గేట్లు, ఫ్లెక్సీలు.. ఖాళీ కుర్చీలు
అచ్చంపేట నియోజకవర్గం మద్దిమడుగులో సీఎం సభా ప్రాంగణానికి చేరుకున్న సమయంలో ఇరువైపులా ఏర్పాటు చేసిన భారీ గేట్లు, ఫ్లెక్సీలు కూలిపోయాయి. నాగర్‌కర్నూల్ జిల్లా తెలకపల్లిలో మహిళా సంఘాల నాయకుల కోసం బస్సులు పంపగా వెళ్లకుండా వెనక్కి పంపారు. అచ్చంపేటలో ప్రైవేట్ పాఠశాలల బస్సులు గ్రామాలకు పంపడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పాఠశాలలకు అనధికార సెలవులు ఇచ్చారు. జనసందడి కనిపించక ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. సీఎం మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. ఇందిరమ్మ చీరల పంపిణీలో స్టేజీపై రాహుల్‌గాంధీ, ఖర్గే, తెలంగాణ ఇన్చార్జి సందీప్ కుమార్ ఫొటోలు పెట్టడం విమర్శలకు తావిచ్చింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమా? కాంగ్రెస్ పార్టీ కార్యక్రమమా? అంటూ ప్రజలు సెటైర్లు వేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

