గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతి
గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందాడు. అధికారుల వేధింపులతోనే తన భర్త మరణించినట్టు మృతదేహంతో భార్య నిరసన తెలిపిన ఘటన కరీంనగర్లో జరిగింది.
- అధికారుల వేధింపులే కారణమని కుటుంబసభ్యుల ఆందోళన
కరీంనగర్ తెలంగాణచౌక్, నవంబర్ 26: గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్ మృతిచెందాడు. అధికారుల వేధింపులతోనే తన భర్త మరణించినట్టు మృతదేహంతో భార్య నిరసన తెలిపిన ఘటన కరీంనగర్లో జరిగింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్‌కు చెందిన కే జంపన్న కరీంనగర్ డిపో-1 డ్రైవర్‌గా విధులు నిర్వహి స్తూ.. కరీంనగర్‌లోని మంకమ్మతోటలో నివాసం ఉంటున్నాడు. సమీప బంధువు ల వివాహం కోసం ఇటీవల రెండురోజులు లీవ్ తీసుకున్నాడు.
అధికారుల సమాచారమిచ్చి మరో రెండురోజులపాటు పొడిగించుకున్నాడు. తర్వాత నాలుగు రోజులుగా విధులకు వస్తున్నా అధికారులు డ్యూటీ ఇవ్వకపోవడంతో మనస్తాపం చెం దాడు. గురువారం డిపోకు వచ్చినా.. డ్యూటీ ఇవ్వకపోవడంతో ఇంటికి వెళ్లాడు. సాయంత్రం 4 గంటలకు ఛాతిలో నొప్పి వస్తుందని కుటుంబసభ్యులకు తెలుపగా వారు దవాఖానకు తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.
అధికారులు డ్యూటీ ఇవ్వకుండా వేధించడంవల్లే జం పన్న మృతి చెందాడని కుటుంబసభ్యులు, బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని డిపో-1 ఎదుట ఉంచి నిరసన తెలిపారు. టీఎంయూ నాయకులు, కుటుంబసభ్యు లు ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. వేధించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని, జంపన్న కొడుకుకు ఉద్యోగం కల్పిస్తామని ఇచ్చిన హామీతో కుటుంబసభ్యులు ఆందోళన విరమించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

