కాంగ్రెస్ గూండాగిరీ
హైదరాబాద్ నగరం నడిబొడ్డున కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ శాంతియుత నిరసనపై వీరంగం సృష్టించారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోతె రోహిత్ ఆధ్వర్యంలో గుంపులుగా తరలివచ్చిన గూండాలు విధ్వంసం సృష్టించారు.
- బీఆర్ఎస్ నిరసనపై అధికార పార్టీ దౌర్జన్యం
- అశోక్‌నగర్‌లో నిరుద్యోగ యువతకు రాహుల్ ఇచ్చిన హామీలకు మూడేండ్లు
- నాడు బావర్చిలో బిర్యానీ తింటూ భరోసా
- నేడు ఆయన ఫొటోకు బిర్యానీ తినిపిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరుద్యోగుల నిరసన
- 120 మంది గూండాలతో చొరబడి ఎంపీ అనిల్, డీసీసీ అధ్యక్షుడు రోహిత్ వీరంగం
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ నగరం నడిబొడ్డున కాంగ్రెస్ గూండాలు దౌర్జన్యానికి దిగారు. బీఆర్ఎస్ శాంతియుత నిరసనపై వీరంగం సృష్టించారు. ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోతె రోహిత్ ఆధ్వర్యంలో గుంపులుగా తరలివచ్చిన గూండాలు విధ్వంసం సృష్టించారు. కాంగ్రెస్ గూండాలు యథేచ్ఛగా మూకుమ్మడి దాడి చేస్తున్నా పోలీసులు వారికే అనుకూలంగా వ్యవహించడంపై నిరసన వ్యక్తమవుతున్నది.
ఎన్నికల ముందు సరిగ్గా మూడేండ్ల క్రితం రాహుల్‌గాంధీ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్‌కు వచ్చి బిర్యానీ తింటూ నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నేటికీ అమలుకాలేదు. ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరో సా ఇచ్చి మోసం చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో నిరుద్యోగులు అక్కడికి చేరుకొన్నారు.
నిరుద్యోగులను నమ్మించి మోసం చేసి మూడేం డ్లు పూర్తవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రాహుల్‌గాంధీ ఫొటోకు బిర్యానీ తినిపిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు నిరసన వ్యక్తంచేశారు. ఇదే సమయంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోతె రోహిత్ సహా పలువురు కాంగ్రెస్ గూండా లు గుంపులు గుంపులుగా వచ్చి బావర్చి హోటల్లో విధ్వంసం సృష్టించారు. హోటల్లోని సామగ్రిని ధ్వంసంచేశారు.
కుర్చీ లు, ప్లేట్లను విసిరేసి వీరంగం సృష్టించారు. 120 మందికి పైగా ఒక్కసారిగా హోటల్లోకి దూసుకొచ్చి గూండాగిరీ చేయడంతో హోటల్‌కు వచ్చిన కస్టమర్లు భయభ్రాంతులకు గురయ్యారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. కాంగ్రెస్ రౌడీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు, నిరుద్యోగులు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తంచేశారు. ఈ క్రమంలో మన్నె క్రిశాంక్‌పై కూడా దాడికి యత్నించారు. ఏటా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చేసిన మోసాన్ని ప్రశ్నించినందుకు దాడులకు ప్రయత్నించడంపై క్రిశాంక్ సహా నిరుద్యోగ యువత తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసింది. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే దాడులు చేస్తారా? అంటూ నిలదీశారు.
గులాబీలపై దాడి.. క్రిశాంక్ కారు ధ్వంసం
శాంతియుతంగా బిర్యానీ తింటూ నిరసన తెలుపుతున్న మన్నె క్రిషాంక్, ముఠా జయసింహ, పాటిమీది జగన్, దినేశ్‌చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి, సహా బీఆర్ఎస్ శ్రేణులపై రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్ యాదవ్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మోతె రోహిత్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడ్డారు. పోలీసుల సమక్షంలోనే బీఆర్ఎస్ నాయకులపై దాడిచేశారు. అక్కడే ఉన్న మన్నె క్రిశాంక్ కారును పూర్తిగా ధ్వంసం చేశారు. బీఆర్ఎస్ నాయకుడు దినేశ్‌తోపాటు పలువురు గాయపడ్డారు. ఒక్కసారిగా ఆ ప్రాంతంలో భయానక వాతావరణం ఏర్పడింది.
హోటల్ యజమానికి తీవ్ర గాయాలు
హోటల్లోకి చొరబడిన 120 మంది కాంగ్రెస్ గూండాలు కర్రలు, ఇనుపరాడ్లతో విచక్షణారహితంగా దాడికి తెగబడ్డారు. హోటల్ యజమాని వారికి సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా, ఆయనపై కూడా దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. కస్టమర్లను కూడా బయటకు పంపించి, లైట్లు ఆపేసినా దాడిని కొనసాగించారు. వందలాదిగా కర్రలు, ఇనుప రాడ్లతో విరుచుకుపడటంతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వారిని ఆపేందుకు ప్రయత్నించినా వినకుండా హోటల్‌ను పూర్తిగా ధ్వం సం చేశారు. ప్లేట్లు, గ్లాసులు విసిరేసి, కౌంటర్లు, టేబుళ్లు, కుర్చీలు, మెటల్ డిటెక్టర్‌ను విరగ్గొట్టి నానా రభస సృష్టించారు. హోటల్ స్థాపించి 30 ఏండ్లు అవుతున్నా దాడి చేయడం ఇదే ప్రథమమని ఆ హోట ల్ యజమాని ఆందోళన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు చిక్కడిపల్లి పీఎస్‌లో ఫిర్యాదు చేశారు.
రాహుల్.. రెండు లక్షల ఉద్యోగాలేవీ?
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ యువతకు రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆచరణలో విఫలమైందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో రాహుల్‌గాంధీ చాయ్ తాగుతూ, ఫొటోలకు పోజులిస్తూ యువతకు అనేక హామీలు ఇచ్చారని గుర్తుచేశారు.
రెండేండ్ల్లలో రెండు లక్షల ఉద్యోగాల హామీ, యువ వికాసం నినాదం ఆచరణలో మిథ్యగా మారాయని విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి గురువారం ఎక్స్ వేదికగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మూడేండ్ల క్రితం అశోక్‌నగర్‌లో మీరు నాటకీయ లైటింగ్ మధ్య చాయ్ తాగుతూ, ఫొటోలకు పోజులిస్తూ, ఆకాశమే హద్దుగా హామీలు గుప్పించారు. ఇప్పుడు అసలు నిజం బయటపడింది’ అని ఎద్దేవా చేశారు.
ఉద్యోగాలపై ప్రశ్నిస్తే దాడులా?
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాలు ఇస్తామంటూ ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే దాడులకు పూనుకోవడం ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ బీఆర్ఎస్ యువ నాయకులు మన్నె క్రిశాంక్, ముఠా జైసింహ, జగన్ పాటిమీది, దినేశ్ చౌదరి, విష్ణువర్ధన్‌రెడ్డి, హరీశ్రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు.
ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. రాజ్యాంగ దినోత్సవం రోజునే తెలంగాణలో ఇందిరమ్మ ఎమర్జెన్సీ నాటి పాలనను తలపించేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని దునుమాడారు. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి హోటల్లో బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ ఆధ్వర్యంలో శాంతియుతంగా నిర్వహిస్తున్న కార్యక్రమంపై కాంగ్రెస్ గూండాలు దాడికి తెగబడటం దారుణమని ఖండించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!
Anjali Kulthe | ఆ ఉగ్రదాడి నుంచి 20 మంది గర్భిణీలను కాపాడిన నర్సు..!
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ

