Hyderabad | చలనచిత్ర రంగంలో సరికొత్త రికార్డులకు వేదికవుతున్న హైదరాబాద్ కీర్తి కిరీటంలో మరో మైలురాయి చేరనుంది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ డిస్ట్రిబ్యూటర్, నిర్మాత ఏషియన్ సునీల్ కలిసి ప్రపంచ స్థాయి హంగులతో ఒక భారీ సినిమా స్క్రీన్‌ను హైదరాబాద్‌లో నిర్మిస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రారంభమైన వెంటనే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్క్రీన్లలో ఒకటిగా నిలవబోతుండటం విశేషం.
తెలుగు సినిమా ప్రేక్షకులకు సరికొత్త విజువల్ వండర్‌ను అందించాలనే ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి మరియు ఏషియన్ సునీల్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కింబోతున్నారు. ఈ స్క్రీన్ కచ్చితమైన కొలతలు, నిర్మాణ శైలి మరియు అధికారిక ప్రారంభోత్సర తేదీ ఎప్పుడెప్పుడా అని టాలీవుడ్ వర్గాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.