Watch: రెండుసార్లు పడినప్పటికీ.. కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ యత్నం
Woman Falls Twice to Board Train | కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ ప్రయత్నించింది. అయితే పట్టుతప్పిన ఆమె రెండుసార్లు ఫ్లాట్ఫారమ్పై పడింది. ఇది చూసి అక్కడున్న వారు ఆందోళన చెందారు. అయినప్పటికీ మూడోసారి ప్రయత్నించిన ఆమె అతికష్టం మీద రైలు ఎక్కింది.
లక్నో: కదులుతున్న రైలు ఎక్కేందుకు మహిళ ప్రయత్నించింది. అయితే పట్టుతప్పిన ఆమె రెండుసార్లు ఫ్లాట్ఫారమ్పై పడింది. ఇది చూసి అక్కడున్న వారు ఆందోళన చెందారు. అయినప్పటికీ మూడోసారి ప్రయత్నించిన ఆమె అతికష్టం మీద రైలు ఎక్కింది. (Woman Falls Twice to Board Train) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా కంటోన్మెంట్ రైల్వే స్టేషన్లో ఈ సంఘటన జరిగింది. స్టేషన్లో రైలు ఆగడంతో అందులో ప్రయాణించిన ఒక మహిళ వాటర్ బాటిల్ కోసం దిగింది.
కాగా, స్టేషన్ నుంచి రైలు కదలడంతో ఫ్లాట్ఫారమ్పై ఉన్న మహిళ పరుగున ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే పట్టుతప్పిన ఆమె ఫ్లాట్ఫారమ్పై పడింది. రైలులో ఆమె చిన్నారి ఉండటంతో ఆందోళన చెందింది. దీంతో కదులుతున్న రైలు ఎక్కేందుకు మళ్లీ ప్రయత్నించింది. హ్యాండిల్ నుంచి చేయి జారడంతో రెండోసారి కూడా ఫ్లాట్ఫారమ్పై పడింది.
మరోవైపు ఇది చూసి ఫ్లాట్ఫారమ్పై ఉన్న కొందరు వ్యక్తులు ఆ మహిళ వద్దకు చేరుకున్నారు. అయితే వెంటనే పైకి లేచిన ఆమె రైలు ఎక్కేందుకు మూడోసారి ప్రయత్నించింది. మళ్లీ పట్టుతప్పి జారుతుండగా కంపార్ట్మెంట్ డోర్ వద్ద ఉన్న కొందరు ఆమెను పట్టుకుని లోపలకు లాగారు. దీంతో ఆ మహిళ మూడో ప్రయత్నంలో రైలులోకి చేరుకున్నది. అదృష్టవశాత్తు ఆమె రెండుసార్లు కూడా ఫ్లాట్ఫారమ్పై పడటంతో ముప్పుతప్పింది.
కాగా, ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కదులుతున్న రైలు ఎక్కుతూ రెండుసార్లు పడినప్పటికీ ఆ మహిళ మళ్లీ మళ్లీ ప్రయత్నించడాన్ని పలువురు విమర్శించారు. రైల్వే కూడా దీనిపై స్పందించింది. కదులుతున్న రైలు ఎక్కవద్దని ప్రయాణికులకు సూచించింది.
🚨 Shocking Scene at Delhi–Agra Route 🚨
A terrifying moment was caught on camera as a woman tried to board a moving train and fell not once, but TWICE 😳
Eyewitnesses say the incident happened on the busy Delhi–Agra railway route, where trains run at high speed and platforms… pic.twitter.com/fbhd8IFTr1
— The Nalanda Index (@Nalanda_index) March 1, 2026
Also Read:
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- board
- Falls
- moving train
- trying
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

