Srinivas Goud | తెలంగాణ నీటిపై ఏపీ మళ్లీ కుట్రలు మొదలు పెట్టిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ ఫైర్ అయ్యారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ..ఆంధ్రప్రదేశ్ ఈఎన్సీ చైర్మన్ కృష్ణారివర్ మేనేజ్మెంట్ బోర్డు (KRMB)కి లేఖ రాశాడు. ఆయన వాళ్ల రాష్ట్రం గురించి మాట్లాడాలి కానీ తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా రివర్ బేసిన్లో ఉన్న ప్రాంతానికి కేవలం 30 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇవ్వాలని.. అంటే 30 శాతం మాత్రమే తెలంగాణకు ఇవ్వండి.. మిగితా నీళ్లు మేం తీసుకుపోతం. అంటే 146 టీఎంసీలు మేం తీసుకెళ్తం.. 30 టీఎంసీలు తెలంగాణ వాళ్లకు ఇచ్చేయండి అని.. ఆయన ఎవడు.. తెలంగాణ గురించి రాయడానికి నీకు ఎవడు అధికారం ఇచ్చిండన్నారు.
100 శాతం కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి నువ్వు కృష్ణా బేసిన్ నుంచి పెన్నా బేసిన్‌కు కృష్ణా రివర్‌కు 80-90 శాతం నీళ్లు తీసుకుపోతున్నరు. పోతిరెడ్డి పాడు ద్వారా 10 వేల క్యూసెక్కులు అని చెనప్పి 30 వేల క్యూసెక్కుల నీళ్లు తీసుకెళ్లి ఆ ప్రాంతంలో నింపుకుంటున్నరని ఆరోపించారు. తెలంగాణకు ఎన్ని నీళ్లు ఇవ్వాలో డిసైడ్ చేయడానికి వాడు ఎవడు..? ఏపీ ఈఎన్సీ లేఖ రాసిన రోజే తెలంగాణ ఈఎన్సీ కూడా KRMBకి లేఖ రాశాడు.
మాకు కృష్ణా నదిపై రిజర్వాయర్లు లేవు, నీటిని ఏపీకి ఇబ్బంది లేకుండా ఇవ్వాలని తెలంగాణ ఈఎన్సీ లేఖ రాశాడు.. ఏదుల, నార్లాపూర్ రిజర్వాయర్లు లేవా..? 10 ఏళ్లలో తెలంగాణ నీటిపై లేని కుట్రలు మళ్లీ ఎందుకు మొదలవుతున్నాయి..? తెలంగాణ ప్రభుత్వం చేతకానిది అనే కదా..? ఏపీ మోచేతి కింద బతుకుతుందనే కదా..? తెలంగాణకు అన్యాయం చేసే అధికారులను వదిలిపెట్టము, జాగ్రత్త అని శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు. తెలంగాణ ఈఎన్సీకి లేఖ రాయమని ఎవరు చెప్పారు..? రేవంత్ రెడ్డి చెప్పాడా..? అని అడిగారు.
తెలంగాణ నీటిపై ఏపీ మళ్లీ కుట్రలు మొదలు పెట్టింది
కృష్ణా నదీ జలాలలో తెలంగాణకు కేవలం 30 టీఎంసీల నీళ్లు మాత్రమే ఇవ్వాలని ఏపీ ఈఎన్సీ KRMBకి లేఖ రాశాడు
తెలంగాణకు ఎన్ని నీళ్లు ఇవ్వాలో డిసైడ్ చేయడానికి వాడు ఎవడు?
ఏపీ ఈఎన్సీ లేఖ రాసిన రోజే తెలంగాణ ఈఎన్సీ కూడా KRMBకి లేఖ రాశాడు… pic.twitter.com/kfHIMycGoK
— Telugu Scribe (@TeluguScribe) August 15, 2026
Weekend OTT | ఇండిపెండెన్స్ డే స్పెషల్.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన చిత్రాలివే!
FBI Report | అమెరికాలో భారీగా తగ్గిన హత్యల రేటు.. గడిచిన 75 ఏళ్లలో అత్యంత కనిష్ఠం..!
Rosemary Oil | జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రోజ్మేరీ ఆయిల్..అధ్యయనంలో వెల్లడి..