వరంగల్ ఎయిర్పోర్టుకు పాపన్నగౌడ్ పేరు పెట్టాలి
వరంగల్ ఎయిర్పోర్ట్కు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పె ట్టాలని, కామారెడ్డి డిక్లరేషన్లో భాగం గా జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ జి ల్లాగా నామకరణం చేయాలని గౌడ ఐ క్యసాధన సమితి రాష్ట్ర కమిటీ అంబాల నారాయణగౌడ్ డిమాండ్ చేశారు.
- గౌడ ఐక్య సాధన సమితి డిమాండ్
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ) : వరంగల్ ఎయిర్పోర్ట్కు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ పేరు పె ట్టాలని, కామారెడ్డి డిక్లరేషన్లో భాగం గా జనగామ జిల్లాకు పాపన్నగౌడ్ జి ల్లాగా నామకరణం చేయాలని గౌడ ఐ క్యసాధన సమితి రాష్ట్ర కమిటీ అంబాల నారాయణగౌడ్ డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ గౌడ ఐక్యసాధన సమితి రాష్ట్ర కమిటీ నుంచి యువజన విభాగం అధ్యక్షుడిగా రాయికోడ్ రాఘవేందర్గౌడ్ను నియమించినట్టు ప్రకటించారు. రాఘవేందర్గౌడ్కు నియామకపత్రాన్ని అందించిన అనంతరం నారాయణగౌడ్ మాట్లాడారు.
బీసీ, బహుజనులు, యువజనుల హకుల కోసం, గౌడన్నల సమస్యల సాధన కోసం పోరాటాలు చేయాల్సి ఉన్నదని తెలిపారు. దసరా తర్వాత దశలవారీగా సర్వాయి పాపన్న భావజాల వ్యాప్తికోసం ‘పల్లె పల్లెకు పాపన్న స్ఫూర్తి యాత్రలు’ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టాలని తీర్మానించినట్టు చెప్పారు. త్వరలో గౌడ ఐక్యసాధన సమితి యువ సమ్మేళనం నిర్వహిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో గౌడ ఐక్య సాధన సమితి మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పాల ఓంకార్గౌడ్, గౌడ ఐక్య సా ధన సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర అ ధ్యక్షుడు బాలక్రిష్ణగౌడ్, యువజన నేత పాలమాకుల నరేశ్గౌడ్ పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

