woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
woman falls in love with old man | సుమారు 30 ఏళ్ల వయస్సున్న మహిళ, 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. వయస్సులో 45 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆ వృద్ధుడికితో వివాహానికి తనకు ఎలాంటి అభ్యంతరం, సమస్య లేదని ఆ మహిళ స్పష్టం చేసింది.
లక్నో: సుమారు 30 ఏళ్ల వయస్సున్న మహిళ, 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించింది. ఆయనను పెళ్లి చేసుకోవాలని ఆమె నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వారిద్దరికి నిశ్చితార్థం జరిగింది. వయస్సులో 45 ఏళ్ల వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆ వృద్ధుడికితో వివాహానికి తనకు ఎలాంటి అభ్యంతరం, సమస్య లేదని ఆ మహిళ స్పష్టం చేసింది. (woman falls in love with old man) ఉత్తరప్రదేశ్లోని ఔరైయా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 30 ఏళ్ల రీనా, సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్గా పాపురల్ అయ్యింది. ఏడాది కిందట 75 ఏళ్ల రామ్ సాగర్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇది వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని వారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇటీవల వీరిద్దరికి ఘనంగా నిశ్చితార్థం జరిగింది. దసరా నవరాత్రుల తర్వాత వారి పెళ్లి కోసం ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి.
కాగా, 75 ఏళ్ల వృద్ధుడైన రామ్ సాగర్ను తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు రీనా ధృవీకరించింది. తమ ఇద్దరి మధ్య 45 ఏళ్ల వయస్సు వ్యత్యాసం ఉన్నప్పటికీ అది ఏమాత్రం సమస్య కాదని ఆమె స్పష్టం చేసింది. తన నిర్ణయం పట్ల తాను సంతోషంగా ఉన్నట్లు తెలిపింది. తమ మధ్య ఉన్న వయస్సు అంతరం తమ బంధానికి ఎటువంటి అడ్డంకి కాదని ఆమె పేర్కొంది.
అయితే వీరి నిశ్చితార్ధానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో విభిన్నమైన వీరి ప్రేమకథ ఆన్లైన్లో చర్చకు దారి తీసింది.
75-year-old Ramsugar is set to marry 30-year-old Instagram Reels creator Rani Rajput after they fell in love a year ago. Their ring ceremony is already done, and the wedding is planned after Navratri.
Auraiya, Uttar Pradesh https://t.co/BM67JQ9shk
— Ghar Ke Kalesh (@gharkekalesh) October 15, 2026
प्यार उम्र की सरहदों और फासलों को नहीं देखता, इस बात को सच साबित करती एक अनोखी प्रेम कहानी औरैया और सहार क्षेत्र में चर्चा का विषय बनी हुई है। यहां सहार ब्लॉक के अरियारी गांव के रहने वाले 75 वर्षीय वृद्ध रामसुगर को औरैया की रहने वाली 30 वर्षीय चर्चित इंस्टाग्राम ब्लॉगर रानी राजपूत से मोहब्बत हो गई। उम्र के इस पड़ाव पर परवान चढ़े प्यार को अब दोनों ने शादी के बंधन में तब्दील करने का फैसला कर लिया है।
#UttarPradesh #AuraiyaNews #LoveStory #AmarUjala
— Amar Ujala (@AmarUjalaNews) October 15, 2026
UP:75 साल बुजुर्ग को बेटी की दोस्त से हुआ प्यार 30 वर्षीय व्लॉगर से रचाएंगे शादी🤪
➡️75 बर्षीय रामसुगर को इंस्टा व्लॉगर रानी से हुआ प्यार
➡️बेटी राधा के साथ वीडियो बनाने आती थी रानी
➡️पिता को बेटी की दोस्त से हुआ प्यार, सगाई हुई
➡️औरैया के ब्यूटी पार्लर में दोनों की सगाई भी हुई
➡️जल्द ही दोनों शादी के बंधन में बंधेंगे- परिवार#viralreels #viral #viralpost #trending #love
— Nawada District News (@NawadaDNews) October 15, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

