తెలంగాణ ఆర్థికరంగ శిల్పి కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర తొలి దశాబ్ద చరిత్రను రాసేటప్పుడు, నూతన రాష్ర్టాన్ని తొలినాళ్లలో నడిపించిన రాజకీయ నాయకత్వానికి సహజంగానే ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుంది. సమర్థవంతమైన పాలనలో పాలకులు, ఆర్థికవేత్తలు, ప్రణాళిక నిపుణులు, సలహాదారులు కీలక పాత్ర పోషిస్తారు. 2014- 2023 మధ్య తెలంగాణ ఆర్థిక ప్రస్థానంలో కేసీఆర్ మార్గదర్శకత్వంలో అనేక మంది ప్రత్యేక కృషి చేశారు. ప్రభుత్వ ఆర్థిక సలహాదారుగా పనిచేసిన జీఆర్ రెడ్డి,రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన నిర్మాణాత్మక విధాన రూపకల్పనలో తనవంతు బాధ్యతను నిర్వర్తించారు. దీర్ఘకాలిక ఆర్థిక వ్యూహాన్ని తయారు చేశారు. ఆ దశాబ్ద కాలంలో దేశంలోనే తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన ప్రధాన రాష్ర్టాల్లో ఒకటిగా ఎదిగింది. బీఆర్ఎస్ పాలన వల్లరాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకున్నదని నేటి పాలకులు అసత్య ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో, కేసీఆర్ హయాంలో అనుసరించిన ఆర్థిక వ్యూహం,
భవిష్యత్తు తరాలకు కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పన, మూలధన పెట్టుబడిని పరిశీలించాల్సిన అవసరమున్నది.
2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు, అవకాశాలతోపాటు అనేక సవాళ్లు వారసత్వంగా వచ్చాయి. హైదరాబాద్ రూపంలో రాష్ర్టానికి ఆర్థికపరమైన ప్రయోజనాలు ఉన్నప్పటికీ, ఉమ్మడి రాష్ట్రంలో నెలకొన్న స్తబ్ధత కారణంగా గణనీయమైన బాధ్యతలను మోయాల్సిన పరిస్థితి నెలకొన్నది. కొత్త సంస్థల ఏర్పాటు, మౌలిక సదుపాయాల విస్తరణ, నూతన సంక్షేమ వ్యవస్థలను నెలకొల్పడం, ఉద్యమ సమయంలో ప్రజల్లో ఏర్పడిన ఆకాంక్షలను నెరవేర్చడం రాష్ట్రం ముందున్న కర్తవ్యాలుగా మారాయి. అదే సమయంలో అభివృద్ధిపై పెట్టుబడులు పెడుతూనే ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుకోవడం అత్యంత కీలక సవాళ్లలో ఒకటిగా నిలిచింది. దశాబ్దాలుగా అభివృద్ధి చెందిన ఇతర రాష్ర్టాల మాదిరిగా కాకుండా, తెలంగాణ విధాన రూపకర్తలు మొదటి నుంచి కొత్త ఆర్థిక నిర్మాణ వ్యవస్థను రూపొందించాల్సిన బాధ్యతను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆర్థిక సలహాదారు పాత్ర అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నది.
కేసీఆర్ హయాంలో తెలంగాణ ఆర్థిక నమూనా ప్రధానంగా నాలుగు విస్తృతమైన అంశాలపై ఆధారపడింది. అవి, ఆదాయ సమీకరణ, మూలధన కూర్పు, సంక్షేమ విస్తరణ, ఆర్థిక క్రమశిక్షణ. బడ్జెట్‌ను సమతుల్యం చేయడం మాత్రమే ఈ వ్యూహ లక్ష్యం కాదు. ప్రభుత్వ వ్యయాలు దీర్ఘకాలిక ఆర్థిక వృద్ధికి తోడ్పడేలా స్థిరమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడం కూడా ప్రధాన ఉద్దేశం.
కేసీఆర్ దిశానిర్దేశం, ఆధ్వర్యంలో డాక్టర్ జీఆర్ రెడ్డి, ఆర్థిక నిర్వహణ బృందం తెలంగాణ పాలనా నమూనాకు ప్రత్యేక లక్షణంగా మారిన ఒక సూత్రానికి ప్రాధాన్యం ఇచ్చారు. బలమైన సొంత పన్నుల ఆదాయానికి తోడుగా పెట్టుబడుల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడం ఆ సూత్రం. బాహ్య ఆర్థిక సాయంపై అతిగా ఆధారపడకుండా, రాష్ట్ర సొంత ఆదాయ వనరులను బలోపేతం చేసుకోవడంపై ఆర్థిక ప్రణాళిక క్రమంగా దృష్టి సారించింది. రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి అత్యంత ముఖ్యమైన సూచికల్లో రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం (ఎస్వోటీఆర్) ఒకటి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాతి దశాబ్ద కాలంలో తెలంగాణ, దేశంలోని రాష్ర్టాలతో పోలిస్తే అత్యంత బలమైన సొంత పన్నుల ఆదాయ వసూళ్లను స్థిరంగా నమోదు చేసింది.
ఈ పనితీరుకు పలు అంశాలు దోహదపడ్డాయి. అవి, పట్టణ ఆర్థిక వ్యవస్థ వేగంగా విస్తరించడం, ఐటీ, శాస్త్ర, సాంకేతిక రంగాల వృద్ధి, రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగ కార్యకలాపాల విస్తరణ, వాణిజ్య వినియోగం పెరుగుదల, పన్నుల పరిపాలన మెరుగుపడటం, పన్నుల చెల్లింపులో మెరుగైన విధానాల అమలు. సొంత ఆదాయ వనరులు నిరంతరంగా పెరగడం వల్ల ఆర్థికపరమైన వెసులుబాటును కొనసాగిస్తూనే, ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు సమకూర్చుకోవడం ప్రభుత్వానికి సాధ్యమైంది. కేంద్రం నుంచి వచ్చే నిధులపై అధికంగా ఆధారపడే రాష్ర్టాల్లా కాకుండా, తెలంగాణ తన అంతర్గత ఆదాయ వనరులను బలోపేతం చేసుకున్నది.
2014-23 మధ్య ఎక్కువ కాలం ఆదాయ మిగులును కొనసాగించగలగడం తెలంగాణ ఆర్థిక పనితీరులో అత్యంత ముఖ్యమైన అంశం. ఒక ప్రభుత్వానికి సాధారణంగా వచ్చే ఆదాయం, రోజువారీ నిర్వహణ వ్యయాల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు దానిని ఆదాయ మిగులు అంటారు. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు రోజువారీ ఖర్చుల కోసం అప్పులు చేయకుండా, మూలధన కల్పనకు నిధులను మళ్లించడానికి ప్రభుత్వాలకు అవకాశం లభిస్తుంది. తెలంగాణ తన ప్రస్థానాన్ని స్వల్ప ఆదాయ మిగులుతో ప్రారంభించి, ఆ తర్వాత పలు సంవత్సరాల్లో గణనీయమైన ఆదాయ మిగులును నమోదు చేసింది. అంతేకాకుండా రైతుబంధు, భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, తాగునీటి పథకాలు, పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణపై ఏకకాలంలో దృష్టి పెట్టే వీలు కలిగింది.
కొవిడ్ కారణంగా ఏర్పడిన అసాధారణ అంతరాయం ఈ ఆర్థిక ప్రస్థానాన్ని తాత్కాలికంగా ప్రభావితం చేసింది. ఆర్థిక పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకున్న తర్వాత తెలంగాణలో ఆదాయ మిగులు వ్యవస్థ మళ్లీ పునరుద్ధరించడం గమనించాల్సిన ముఖ్యమైన అంశం. రాష్ట్ర బడ్జెట్ల ప్రకారం, తెలంగాణ 2022-23 ఆర్థిక సంవత్సరాన్ని రూ.5,994 కోట్ల ఆదాయ మిగులుతో ముగించింది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరికి రూ.772 కోట్ల సానుకూల ఆదాయ నిల్వను నమోదు చేసింది. జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నప్పటికీ రాష్ట్రం అసాధారణమైన పనితీరును ప్రదర్శించడం గమనార్హం. తెలంగాణ అభివృద్ధి వ్యూహంలో ప్రత్యేకంగా కనిపించిన అంశాల్లో మూలధన వ్యయానికి ఇచ్చిన ప్రాధాన్యం ఒకటి.
సాధారణంగా ఆర్థికవేత్తలు, సాధారణ నిర్వహణ వ్యయంతో పోలిస్తే మూలధన వ్యయం ఆర్థిక వృద్ధికి ఎక్కువగా దోహదపడుతుందని భావిస్తారు. ఎందుకంటే, దీర్ఘకాలిక ఆర్థిక ప్రయోజనాలను అందించే ఉత్పాదక ఆస్తుల నిర్మాణానికి ఇది దోహదపడుతుంది. కేసీఆర్ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టులు,మిషన్ భగీరథ, రోడ్డు రవాణా, పట్టణాభివృద్ధి, సాగుకు సహాయ చర్యలు, ప్రభుత్వ భవనాల అభివృద్ధికి ప్రధాన పెట్టుబడులు కింది రంగాల్లో జరిగాయి.
తెలంగాణ తొలి దశాబ్దపు ఆర్థిక పనితీరును పలువురు ఆర్థికవేత్తలు, విధాన పరిశీలకులు గుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, పలు ఆర్థిక సూచికల్లో దేశంలోనే తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా అవతరించిందని బహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి అభిప్రాయాలు తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం కొన్ని ప్రత్యేక పథకాలకే పరిమితం కాలేదని, సమగ్ర ఆర్థిక పరివర్తనకు ప్రతిరూపంగా నిలిచింది. ఈ విజయానికి విస్తృతమైన గుర్తింపు లభించడం తెలిసిందే. కేసీఆర్ ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేయడంలో జీఆర్ రెడ్డి ప్రతిష్టాత్మక అభివృద్ధి లక్ష్యాలను నెరవేరుస్తూనే, ఆదాయ బలాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించే బడ్జెట్ నమూనాకు మద్దతు ఇవ్వడం. నేడు అసత్య ప్రచారాలు, అభూత కల్పనలను వాస్తవాలుగా ప్రచారం చేసేవాళ్లు వాస్తవాలను గుర్తించాల్సిన అవసరమున్నది.
తెలంగాణ తొలి దశాబ్దపు ఆర్థిక పనితీరును పలువురు ఆర్థికవేత్తలు, విధాన పరిశీలకులుగుర్తించారు. రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు, పలు ఆర్థిక సూచికల్లోదేశంలోనే తెలంగాణ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రాష్ర్టాల్లో ఒకటిగా అవతరించిందనిబహిరంగంగా వ్యాఖ్యానించారు. ఇలాంటి అభిప్రాయాలు తెలంగాణ అభివృద్ధి ప్రస్థానం కొన్నిప్రత్యేక పథకాలకే పరిమితం కాలేదని, సమగ్ర ఆర్థిక పరివర్తనకు ప్రతిరూపంగా నిలిచింది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

