అంబేదర్ రాజ్యాంగమా.. అనుముల రాజ్యమా?
తెలంగాణలో అమలవుతున్నది బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగమా? లేక అనుముల రాజ్యాంగమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రాజ్యాం గ దినోత్సవం నాడే సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీలు తీసిన కాంగ్రెస్ నేతలు..
- చేతిలో రాజ్యాంగం.. కడుపులో రౌడీయిజం
- ఇదేనా కాంగ్రెస్ మొహబ్బత్ కా దుకాన్?
- ఢిల్లీలో సంవిధాన్ బచావో.. గల్లీలో గుండాగిరీ చలావో
- నిరుద్యోగులను నమ్మించి గొంతుకోసిన రేవంత్
- ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ బహిరంగ సవాల్
- రాహుల్ హామీలు గుర్తుచేస్తే దాడులు చేస్తారా?
- బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్
హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్నది బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగమా? లేక అనుముల రాజ్యాంగమా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. రాజ్యాం గ దినోత్సవం నాడే సంవిధాన్ బచావో పేరుతో ర్యాలీలు తీసిన కాంగ్రెస్ నేతలు.. అదేరోజు సాయంత్రం హైదరాబాద్‌లో రేవంత్ మార్ రౌడీయిజం ప్రదర్శించారని మండిపడ్డారు. ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు బావర్చి హోటల్లో వినూత్న నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులపై ఎంపీ, ఎమ్మెల్యేల నేతృత్వంలోని కాంగ్రెస్ మూకలు, యూత్ కాంగ్రెస్ నాయకులు దాడి చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
నిరుద్యోగుల పక్షాన నిరంతరం పోరాడుతున్న బీఆర్ఎస్ యువనేతలు మన్నె క్రిశాంక్, జగన్, దినేశ్, విష్ణు, హరీశ్‌తో కలిసి శుక్రవారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. సరిగ్గా మూడేండ్ల క్రితం అశోక్‌నగర్‌కు వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ రోడ్లపై కూర్చొని విద్యార్థులను రెచ్చగొట్టి, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బావర్చి రెస్టారెంట్లో బిర్యానీ తింటూ ఒక పొలిటికల్ థియేట్రికల్ స్టంట్ చేశారని గుర్తుచేశారు.
మొదటి ఏడాదిలోనే 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు, ఏటా జూన్ 2న జాబ్ క్యాలెండర్, నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని యూత్ డిక్లరేషన్ పేరుతో నమ్మబలికి, నేడు లక్షలాది మంది నిరుద్యోగుల గొంతు కోశారని విమర్శించారు. మూడేండ్లు అయినా వాటిలో ఒక హామీని నెరవేర్చలేదని, ఆ హామీలను గుర్తుచేసేందుకు బీఆర్ఎస్ నాయకులు శాంతియుతంగా రా హుల్‌గాంధీ బొమ్మకు బిర్యానీ తినిపిస్తూ ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ వినూత్నంగా నిరసన తెలిపారని పేర్కొన్నారు.
హామీలు గుర్తుచేస్తే దాడులేల?: క్రిశాంక్
తెలంగాణ యువతకు రాహుల్‌గాంధీ ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయాలని గుర్తు చేసేందుకే తాము ఆర్టీసీ ఎక్స్ రోడ్డు బావర్చి హోటల్‌కు వెళ్లామని రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ చెప్పారు. ఇచ్చిన హామీలను గుర్తు చేయకూడదా? అని ప్రశ్నించారు. తాము ముందుగానే మీడియాకు సమాచారం ఇచ్చామని చెప్పారు.
అకడికి వెళ్లిన తమపై లోపలికి సుమారు 200 మంది వచ్చి తమపై హత్యాయత్నానికి ప్రయత్నించారని ఆరోపించారు. లైట్లు ఆర్పివేసి, కార్లను ధ్వంసం చేశారని చెప్పారు. ఒక ఎంపీ కార్యకర్తలను వెంటబెట్టుకొని తమ పై దాడి చేసేందుకు రావడమేందని ప్రశ్నించారు. బంగారం పోయిందంటూ దాడిచేసిన వారే తమపై ఫిర్యాదు చేయడం విడ్డూరమని మండిపడ్డారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు దినేశ్ దరి, హరీశ్‌రెడ్డి, పుట్టా విష్ణువర్ధన్‌రెడ్డి, పాటిమీది జగన్మోహన్రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

