Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Man Forcibly Kiss Girl | బైక్‌పై వెళ్లేందుకు సిద్ధమవుతున్న యువతిని ఒక వ్యక్తి బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ప్రతిఘటించిన ఆమె అదుపు తప్పి బైక్ నుంచి కిందపడింది. ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తిని పోలీసులు విడిచిపెట్టినట్లు యువతి పేరెంట్స్ ఆరోపించారు.
లక్నో: బైక్‌పై వెళ్లేందుకు సిద్ధమవుతున్న యువతిని ఒక వ్యక్తి బలవంతంగా ముద్దుపెట్టుకున్నాడు. ప్రతిఘటించిన ఆమె అదుపు తప్పి బైక్ నుంచి కిందపడింది. ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు. అయితే అదుపులోకి తీసుకున్న ఆ వ్యక్తిని పోలీసులు విడిచిపెట్టినట్లు యువతి పేరెంట్స్ ఆరోపించారు. (Man Forcibly Kiss Girl) ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అక్టోబర్ 10న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఒక యువతి బైక్‌పై వెళ్తున్నది. అయితే బరోలీ మార్కెట్ సమీపంలోని వీధి మలుపులో ఆ బైక్ అకస్మాత్తుగా ఆగిపోయింది. స్టార్ట్ చేసేందుకు ఆ యువతి ప్రయత్నిస్తుండగా ఒక వ్యక్తి వెనుక నుంచి వచ్చి ఆమెను పట్టుకున్నాడు. బలవంతంగా ముద్దు పెట్టుకున్నాడు. ఆ యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. ఈ నేపథ్యంలో అదుపుతప్పిన ఆమె బైక్‌తో పాటు కిందపడిపోయింది. ఆ వ్యక్తి అక్కడి నుంచి పారిపోయాడు.
కాగా, ఈ సంఘటన తర్వాత యువతి తల్లిదండ్రులు వెంటనే అత్యవసర హెల్ప్‌లైన్ ద్వారా పోలీసులను సంప్రదించారు. దీంతో వారు అక్కడకు చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. నిందితుడిని గణేష్ శర్మ అలియాస్ గుడ్డుగా గుర్తించారు. అతడ్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
మరోవైపు పోలీసులు నిందితుడికి చలాన్ జారీ చేసి కొన్ని గంటల్లోనే విడుదల చేశారని యువతి కుటుంబ సభ్యులు ఆరోపించారు. అతడిపై పోక్సో చట్టం లేదా ఇతర సెక్షన్ల కింద ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో నిందితుడ్ని తిరిగి అరెస్ట్ చేసినట్లు తెలుస్తున్నది. అలాగే నిర్లక్ష్యం వహించిన పోలీస్‌పై చర్యలు చేపట్టినట్లు సమాచారం. ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
दुस्साहस देखिए..अधेड़ सरेराह बच्ची को जबरन KI$S करके भाग गया – 😡
इस नालायक की भेंट यमराज से क्यों नहीं हुई..?यूपी में कानून के इकबाल और महिला सुरक्सा के दावे की पोल खोल CCTV वायरल है
अलीगढ़ में बाजार से लौट रही बाइक सवार नाबालिक लड़की के साथ Aश्लीलता,Cheड़छाड़ व जबरन Ki$s करने का आरोप लगा है।
10 अक्टूबर की घटना का CCTV वायरल है जिसमें गणेश शर्मा उर्फ गुड्डू नाम का अधेड़ बच्ची को पकड़ कर जबरन किस करता है और फरार हो जाता है।
शिकायत लेकर थाने गाये पीड़िता ने भाई ने पुलिस पर CCTV फुटेज डिलीट करने का दवाब बनानें अथवा आरोपी का शांतिभंग चालान कर खानापूर्ति करने का आरोप लगाया है।
मामले में SP सिटी आदित्य बंसल के अनुसार आरोपी के खिलाफ गंभीर धाराओं में FIR दर्ज कर न्यायालय में पेश किया गया है वहीं लापरवाह SO धीरज कुमार को सस्पेंड किया गया है।
— Rahul Saini (@JtrahulSaini) October 16, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Sajjala | ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో చంద్రబాబు దాడులు : సజ్జల
Health Tips | మీకు ఫ్యాటీ లివర్ సమస్య ఉందా.. అయితే ఈ పండ్లు తప్పక తినాలి..!
భవాని మాతకు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, గాదరి కిశోర్ ప్రత్యేక పూజలు
ACB Case | ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కీసర సీఐపై ఏసీబీ కేసు నమోదు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

