American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
American Jets | తృటిలో పెను ప్రమాదం తప్పింది. అమెరికా (USA) లోని వాషింగ్టన్ డీసీ (Washington DC) సమీపంలోగల రోనాల్డ్ రీగన్ (Ronald Reagan) నేషనల్ ఎయిర్‌పోర్టు (National Airport) లో రెండు విమానాల రెక్కలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న క్రమంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) కు చెందిన రెండు బోయింగ్ 737 విమానాల రెక్కలు రాసుకున్నాయి.
American Jets : తృటిలో పెను ప్రమాదం తప్పింది. అమెరికా (USA) లోని వాషింగ్టన్ డీసీ (Washington DC) సమీపంలోగల రోనాల్డ్ రీగన్ (Ronald Reagan) నేషనల్ ఎయిర్‌పోర్టు (National Airport) లో రెండు విమానాల రెక్కలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. టేకాఫ్ కోసం సిద్ధమవుతున్న క్రమంలో అమెరికన్ ఎయిర్‌లైన్స్ (American Airlines) కు చెందిన రెండు బోయింగ్ 737 విమానాల రెక్కలు రాసుకున్నాయి. ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు వెల్లడించారు.
వివరాల్లోకి వెళ్తే.. డల్లాస్ వెళ్లాల్సిన అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 638, చికాగో వెళ్లాల్సిన ఫ్లైట్ 2152 రన్‌వే 19 వద్ద టేకాఫ్ కోసం వరుసలో ఉన్నాయి. ఈ క్రమంలో ట్యాక్సీయింగ్ చేస్తుండగా రెండు విమానాల రెక్కల చివరలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దాంతో ఒక విమానం రెక్కకు చెందిన వింగ్లెట్ భాగం విరిగి ట్యాక్సీవేపై పడిపోయింది. ఈ విషయాన్ని పైలట్లు వెంటనే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
వెంటనే అప్రమత్తమైన అధికారులు రెండు విమానాలను తిరిగి గేట్ల వద్దకు తరలించారు. మెట్రోపాలిటన్ వాషింగ్టన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఫైర్ అండ్ రెస్క్యూ సిబ్బంది ఆ విమానాలను తనిఖీ చేశారు. అనంతరం రెండు విమానాలను మరమ్మతుల కోసం సర్వీసు నుంచి తొలగించినట్లు అమెరికన్ ఎయిర్‌లైన్స్ తెలిపింది. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరిన సంస్థ.. వారిని ఇతర విమానాల్లో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఏర్పాట్లు చేసింది.
థ్యాంక్స్ గివింగ్ సెలెబ్రేషన్ రద్దీ వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ఈ ఘటనపై ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తునకు ఆదేశించింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

