Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | మండే ఎండల కారణంగా వేడిని తట్టుకోలేక ఏసీ చల్లదనం కోసం పాములు ఎయిర్‌పోర్టులో సంచరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆలిస్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టులో ఈ వింత పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణికులు సేదతీరే క్వాంటాస్ లాంజ్, చెక్-ఇన్ ప్రాంతాలు, సిబ్బంది కార్యాలయాల్లోనూ ఇవి సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు.
Viral News : మండే ఎండల కారణంగా వేడిని తట్టుకోలేక ఏసీ చల్లదనం కోసం పాములు ఎయిర్‌పోర్టులో సంచరిస్తున్నాయి. ఆస్ట్రేలియాలోని ఆలిస్ స్ప్రింగ్స్ ఎయిర్‌పోర్టులో ఈ వింత పరిస్థితి కనిపిస్తోంది. ప్రయాణికులు సేదతీరే క్వాంటాస్ లాంజ్, చెక్-ఇన్ ప్రాంతాలు, సిబ్బంది కార్యాలయాల్లోనూ ఇవి సంచరిస్తుండటంతో ఆందోళన చెందుతున్నారు. వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సమస్య మరింత తీవ్రమవుతున్నది. ఈ సమస్యను పరిష్కరించేందుకు స్నేక్ క్యాచర్ రెక్స్ నీన్డార్ఫ్ బృందం వెంటనే రంగంలోకి దిగింది.
ఎయిర్‌పోర్టు నుంచి ఇప్పటికే అనేక పాములను పట్టుకుని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వాటిలో అత్యంత విషపూరితమైన వెస్టర్న్ బ్రౌన్ స్నేక్స్తోపాటు, తక్కువ ప్రమాదకరమైన విప్ స్నేక్స్ కూడా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు పాముల కారణంగా ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలపడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నార్తర్న్ టెరిటరీ ప్రాంతంలో విపరీతంగా పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఎండ వేడిమి నుంచి తప్పించుకునేందుకు, చల్లదనం కోసం పాములు భవనాల్లోకి ఆశ్రయం కోసం వస్తున్నాయని కన్జర్వేషన్ బయాలజిస్ట్ క్రిస్ జాలీ తెలిపారు. పాములు సహజ ఆవాసాలు, మానవ నిర్మిత కట్టడాల మధ్య తేడాను గుర్తించలేవని, చల్లగా ఉండే ప్రదేశం ఎక్కడ దొరికితే అక్కడికి వెళతాయని చెప్పారు. పగటిపూట ఉష్ణోగ్రతలు తీవ్రంగా ఉండటంతో చల్లబడిన తర్వాత రాత్రి, సాయంత్రం వేళల్లో ఇవి ఎక్కువగా బయటకు వస్తున్నట్లు గుర్తించారు.
ఈ పరిణామంతో ఆలిస్ స్ప్రింగ్స్, డార్విన్, టెనెంట్ క్రీక్ విమానాశ్రయాలను నిర్వహించే ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ గ్రూప్ అప్రమత్తమైంది. ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడంతోపాటు నిపుణులైన స్నేక్ క్యాచర్ల సేవలను వినియోగించుకుంటోంది. సిబ్బందికి కూడా పాముల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ఎక్కడైనా పాము కనిపిస్తే, సురక్షిత దూరం పాటించాలని, దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నించవద్దని, వెంటనే నిపుణులకు సమాచారం ఇవ్వాలని స్థానిక అధికారులు ప్రయాణికులకు సూచించారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

