కరెంట్ కరువులో కల్పతరువు
చీకట్లు కమ్ముకుంటున్న ఆపత్కాలంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రాష్ర్టానికి వెలుగులు పంచే పెద్దదిక్కుగా నిలిచింది. నాడు కాంగ్రెస్ నేతలు నిందలు వేసిన ఈ ప్లాంటే నేడు ఆశాదీపమైంది. కరువు కాలంలో విద్యుత్తు డిమాండ్ పెరిగి బహిరంగ మార్కెట్లో కరెంట్ దొరుకని వేళ రాష్ర్టానికి అభయమిస్తున్నది. తెలంగాణ విద్యుత్తు అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నది. వైటీపీఎస్ గొప్పతనాన్ని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ సర్కార్..
- విద్యుత్తు సంక్షోభంలో అండగా వైటీపీఎస్
- కాంగ్రెస్ నేతలు నిందలేసిందే ఆశాదీపం!
- థర్మల్ విద్యుత్తు ఉత్పత్తిలో సింహభాగం
- ఎక్కడా కరెంట్ దొరుకని వేళ ఆపన్నహస్తం
- 3 రోజుల్లోనే 159 మి.యూనిట్ల ఉత్పత్తి
చీకట్లు కమ్ముకుంటున్న ఆపత్కాలంలో యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ రాష్ర్టానికి వెలుగులు పంచే పెద్దదిక్కుగా నిలిచింది. నాడు కాంగ్రెస్ నేతలు నిందలు వేసిన ఈ ప్లాంటే నేడు ఆశాదీపమైంది. కరువు కాలంలో విద్యుత్తు డిమాండ్ పెరిగి బహిరంగ మార్కెట్లో కరెంట్ దొరుకని వేళ రాష్ర్టానికి అభయమిస్తున్నది. తెలంగాణ విద్యుత్తు అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నది. వైటీపీఎస్ గొప్పతనాన్ని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఈ విద్యుత్తు కేంద్రంపైనే అధికంగా ఆధారపడుతున్నది. ఏకంగా ఇక్కడి కరెంట్ కోసం ఇంధన శాఖ స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ వైటీపీఎస్లోనే మకాం వేయాల్సిన పరిస్థితి నెలకొన్నది.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ (వైటీపీఎస్)ను గతంలో కాంగ్రెస్ నేతలు అనవసరమని అభాండాలేశారు. భారీ వ్యయమంటూ నిర్మాణంపై నిందలు గుప్పించారు. బొగ్గు గనులకు దూరంగా వైటీపీఎస్ను నిర్మించడాన్ని తప్పుబట్టారు. ఈ విద్యుత్తు కేంద్రం నిర్మాణ పనులను నామినేషన్ పద్ధతిలో మహారత్న కంపెనీ అయిన బీహెచ్ఈఎల్కు అప్పగించడంపై ఆరోపణలు చేశారు. ఆపై ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక విచారణలతో ఉకిరిబికిరి చేశారు.
కానీ, ఇప్పుడు అదే వైటీపీఎస్ తెలంగాణకు ఆశాదీపమైంది. విద్యుత్తు డిమాండ్ పెరిగి బహిరంగ మార్కెట్లో కరెంట్ దొరుకని వేళ రాష్ర్టానికి అండగా నిలుస్తున్నది. రాష్ట్ర విద్యుత్తు అవసరాలు తీర్చడంలో కీలకపాత్ర పోషిస్తున్నది. వైటీపీఎస్ గొప్పతనాన్ని ఆలస్యంగా గుర్తించిన కాంగ్రెస్ సర్కార్.. ఇప్పుడు ఈ విద్యుత్తు కేంద్రంపైనే అధికంగా ఆధారపడుతున్నది. దీంతో ఇంధన శాఖ స్పెషల్ సీఎస్, జెన్కో సీఎండీ ఏకంగా వైటీపీఎస్లోనే మకాం వేయాల్సిన పరిస్థితి తలెత్తింది. మరోవైపు వైటీపీఎస్కు బొగ్గు సరఫరా, విద్యుత్తు ఉత్పత్తి పెంపుపై ప్రభుత్వం దృష్టిసారించింది. అందులో భాగంగా ఐఏఎస్ అధికారులు సీహెచ్ హరికిరణ్, వెంకటేశ్ ధోత్రే, రాహుల్రాజ్, జింగ్డే హన్మంత్ కొండిబా, కే శివకుమార్ నాయుడును పర్యవేక్షణాధికారులుగా నియమించింది.

Kcr
రాష్ర్టానికి వరప్రదాయిని
ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్తు పీక్ డిమాండ్ 20 వేల మెగావాట్లు దాటడంతో సంక్షోభం తారస్థాయికి చేరింది. దీంతో కరెంట్ కోతలు నిత్యకృత్యమయ్యాయి. వ్యవసాయ అవసరాల కోసం 5-6 గంటలకు మించి కరెంట్ ఇవ్వగలిగే పరిస్థితి లేదు. బహిరంగ మార్కెట్లో విద్యుత్తు కొందామంటే దొరుకడంలేదు. ఈ తరుణంలోనూ రాష్ర్టానికి విద్యుత్తు అందుతున్నదంటే అది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పుణ్యమే. ఇప్పుడు మన ఇంట్లో బల్బు వెలిగేందుకు, ఫ్యాన్లు తిరిగేందుకు, పరిశ్రమలు నడిచేందుకు, అంతర్జాతీయ స్థాయి ఐటీ కంపెనీలు కార్యకలాపాలు సాగించేందుకు ప్రధానంగా వైటీపీఎస్ నుంచే కరెంట్ అందుతున్నది. సూటిగా చెప్పాలంటే ఈ ప్లాంట్ తెలంగాణకు వరప్రదాయినిగా మారింది. కష్టకాలంలో ఆదుకుంటూ రాష్ట్ర ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది.
వైటీపీఎస్ నుంచే అధిక విద్యుత్తు
ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని థర్మల్ ప్లాంట్ల నుంచి ఉత్పత్తి అవుతున్న విద్యుత్తులో అధిక వాటా వైటీపీఎస్దే. గత నాలుగు రోజుల్లోనే ఈ ప్లాంట్ 159.55 మిలియన్ యూనిట్ల విద్యుత్తును అందించింది. జెన్కో థర్మల్ ప్లాంట్లల్లో ఈ నెల 14న 106.75 మిలియన్ యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అయితే.. వైటీపీఎస్ నుంచే 32.19 మిలియన్ యూనిట్ల విద్యుత్తు అందింది. 15న ఉత్పత్తి అయిన 116.52 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తులో వైటీపీఎస్ 46.62 మిలియన్ యూనిట్లు సరఫరా చేసింది. 16న సమకూరిన 118.05 మిలియన్ యూనిట్ల థర్మల్ విద్యుత్తులో 42.94 మిలియన్ యూనిట్లు వైటీపీఎస్ నుంచే వచ్చింది.
సొంత ఉత్పత్తి కేంద్రాలే శరణ్యం
గతంలో విద్యుత్తు డిమాండ్ పెరిగితే రాష్ర్టాలు ఇంధన ఎక్సేంజీ వైపు చూసేవి. కానీ, ఇప్పుడు ఇంధన ఎక్సేంజీలోను కావాల్సినంత విద్యుత్తు దొరుకడంలేదు. ఈ తరుణంలో సొంత ఉత్పత్తి కేంద్రాల విలువ ఎంత కీలకమో వైటీపీఎస్ చాటుతున్నది. గతంలో కాంగ్రెస్ నేతలు అనవరసమన్న యాదాద్రి విద్యుత్తు ప్లాంటే నేడు రాష్ట్ర అవసరాలను తీర్చడంలో ఆశాకిరణంగా నిలుస్తున్నది.


Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

